ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ.. జీతం రూ.2 లక్షలు
ఇండియన్ రైల్వేస్ లో అత్యధిక జీతంతో ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తూ IRCTC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ విశేషం ఏమిటంటే ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూలో మీ టాలెంట్ ఆధారంగా ఈ ఉద్యోగం వస్తుంది. పూర్తి వివరాలకు ఈ కథనం పూర్తిగా చదవండి.
దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సేవలందిస్తున్న రైల్వే డిపార్ట్ మెంట్ లో భారీ జీతం ఇచ్చే జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు రైల్వే శాఖకు చెందిన IRCTC విభాగంలో ప్రకటించారు. IRCTC ఇప్పటికే రైల్వే టిక్కెట్ల బుకింగ్ సేవల్లో నంబర్ వన్ పొజిషనల్ లో ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వేలకు టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలను అందించే ప్రభుత్వ రంగ సంస్థ. ఇది 1999లో ప్రారంభమైంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వరంలో ఐఆర్‌సీటీసీ పనిచేస్తుంది. ఇప్పటి వరకు 66 మిలియన్ల మందికి పైగా ఇందులో నమోదై రైల్వే సేవలను ఉపయోగించుకుంటున్నారు. IRCTC ద్వారా రోజుకు దాదాపు 7.31 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి.
రైల్వేస్ లో జాబ్ సంపాదించాలన్న లక్ష్యంతో ఉన్న వారికి ఈ రిక్రూట్మెంట్ మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఎంపిక కోసం రాత పరీక్ష అవసరం లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మీరు కనుక ఇంటర్వ్యూలో మంచి పర్ఫామెన్స్ ఇస్తే కచ్చింతంగా మీరు ఈ జాబ్ కొట్టొచ్చు.
పోస్టులు ఇవి..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM), డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)తో సహా వివిధ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను తెరిచింది. భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే నెలకు జీతం రూ. 2,00,000 వరకు ఉంటుంది.
అప్లై చేయడం ఇలా...
IRCTC రిక్రూట్‌మెంట్ 2024 కు మీరు అప్లై చేయాలనుకుంటే చివరి గడువు నవంబర్ 6, 2024. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు 55 ఏళ్లు దాటకూడదు. ఈ జాబ్స్ ఎటువంటి రిటెన్ ఎగ్జామ్ ఉండదు. కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
జీతాలు ఇలా..
IRCTC రిక్రూట్‌మెంట్ 2024లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(AGM),డిప్యూటీ జనరల్ మేనేజర్(DGM) పోస్టులకు జీతం గరిష్ఠంగా రూ. 39,100 ఇస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్(DGM-ఫైనాన్స్) స్థానానికి రూ. 70,000 నుండి రూ. 2,00,000 వరకు జీతం ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్ కు అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. గడువులోగా దరఖాస్తులను సమర్పించాలి. పూర్తి చేసిన దరఖాస్తు, అవసరమైన పత్రాలతో పాటు (విజిలెన్స్ చరిత్ర, DAR క్లియరెన్స్, గత మూడు సంవత్సరాల APARతో సహా) రైల్వే బోర్డుకు పంపాలి. అదనంగా అప్లికేషన్ స్కాన్ చేసిన కాపీని నవంబర్ 6, 2024లోపు deputation@irctc.comకి ఇమెయిల్ చేయాలి. మరిన్ని వివరాలకు IRCTC అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.