- Home
- Business
- iQOO Neo 10R 5G: మీకు మొబైల్ గేమ్స్ అంటే ఇష్టమా? iQOO నుంచి సూపర్ గేమింగ్ మొబైల్ వచ్చేస్తోంది
iQOO Neo 10R 5G: మీకు మొబైల్ గేమ్స్ అంటే ఇష్టమా? iQOO నుంచి సూపర్ గేమింగ్ మొబైల్ వచ్చేస్తోంది
iQOO Neo 10R 5G: మొబైల్ గేమ్స్ ఇష్టపడే వాళ్లకి బంపర్ ఆఫర్. iQOO కంపెనీ సూపర్ 5G స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేయనుంది. ఇది ఎంత స్పీడ్ గా ఉంటుందంటే మీకు అదిరిపోయే గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధర తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి.

మొబైల్ గేమ్స్ చాలా బాగుంటాయి కదా.. వర్చువల్ వరల్డ్ అద్బుతమైన ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అందుకే ఎక్కువ మంది గేమ్స్ ఆడటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా యూత్.. మొబైల్ గేమ్స్ లో మునిగి తేలుతుంటారు. అలాంటి వారికి గేమింగ్ లో అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అందించేందుకు iQOO ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. ఈ మొబైట్ డీటైల్స్ ఇక్కడ ఉన్నాయి.
iQOO కంపెనీ నియో 10R 5G స్మార్ట్‌ఫోన్ అనే బెస్ట్ గేమింగ్ మొబైల్ ని రిలీజ్ చేయనుంది. ఇది జస్ట్ స్పీడ్ మాత్రమే కాదు. గేమింగ్ ఇష్టపడేవాళ్లకి అన్నీ ఫీచర్లను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 11, 2025న రిలీజ్ కాబోతోంది. ఈ ఫోన్ లో ఉండే ఫీచర్లు ఏంటంటే..
గేమింగ్ ఎక్స్‌పీరియన్స్:
10R 5G స్మార్ట్‌ఫోన్ లో అల్ట్రా గేమ్ మోడ్ ఉంది. ఇది గేమింగ్ పర్ఫార్మెన్స్ పెంచే ఫీచర్స్ ని ఇస్తుంది. ఇది ఐదు గంటల వరకు 90fps గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
ఈ ఫోన్ 2000Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఇది కచ్చితమైన టచ్ రెస్పాన్స్ ఇస్తుంది. ఇది గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ రెట్టింపు చేస్తుంది.
10R 5G స్మార్ట్‌ఫోన్ లో మాన్‌స్టర్ మోడ్, E-స్పోర్ట్స్ మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. ఇవి గేమింగ్ పర్ఫార్మెన్స్ పీక్స్‌కి తీసుకెళ్తాయి.
ఈ ఫోన్ లో ఉన్న 6034mm నీరావి కూలింగ్ ఛాంబర్ గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.
డిస్‌ప్లే, డిజైన్:
iQOO నియో 10R 5G స్మార్ట్‌ఫోన్‌లో హై రెఫ్రెష్ రేట్ ఉన్న అమోల్డ్ డిస్‌ప్లే ఫిట్ చేశారు. ఇది డిస్ ప్లేని క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా చూపిస్తుంది. ఫోన్ డిజైన్, గేమింగ్ ఇష్టపడేవాళ్లకి నచ్చేలా చాలా మోడ్రన్‌గా ఉంటుంది.
కెమెరా, బ్యాటరీ:
iQOO నియో 10R 5G స్మార్ట్‌ఫోన్‌లో మంచి కాన్ఫిగరేషన్ ఉన్న కెమెరా క్లారిటీగా పిక్చర్స్, వీడియోలు తీస్తుంది. ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ తదితర బెస్ట్ ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
iQOO నియో 10R 5G స్మార్ట్‌ఫోన్ ధర:
iQOO నియో 10R 5G స్మార్ట్‌ఫోన్ కేవలం 30,000 రూపాయల లోపు దొరుకుతుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఈ ఫోన్, మార్చి 11, 2025న ఇండియాలో రిలీజ్ అవుతుంది. అప్పుడు అసలు ధర తెలుస్తుంది.
ఇది కూడా చదవండి వామ్మో.. స్మార్ట్ ఫోన్ ఇంత సన్నగా కూడా ఉంటుందా? ఆపిల్, శాంసంగ్‌కు పోటీ తప్పదు