రూ.80 వేల iPhone 16 రూ.50 వేలకే: Apple ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి
Apple iPhone 16 సిరీస్ ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతోంది. చాలామంది iPhone 16 సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుంది. ఎప్పుడు కొనుగోలు చేయవచ్చని ఆసక్తిగా ఎదురుచూశారు. మార్కెట్లో iPhone 16 మోడల్స్ విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఈ టైమ్ లో Apple కంపెనీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.80 వేల iPhone 16ని రూ.50 వేలకు విక్రయిస్తోంది. మీరు తక్కువ ధరకు ఈ ఫోన్ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
Apple iPhone 16 సిరీస్ విక్రయాలు ప్రస్తుతం జోరందుకున్నాయి. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max అనే నాలుగు మోడళ్లు విడుదలయ్యాయి. ఈ ఫోన్లు ఇప్పుడు Apple అధికారిక స్టోర్లు, Flipkart, Amazon India వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. Apple ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారులు తమ పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. మీ పాత iPhoneని ఆన్‌లైన్‌లో లేదా Apple స్టోర్‌లో ఎక్స్ఛేంజ్ చేసుకుని కొత్త iPhone 16పై తగ్గింపు పొందవచ్చు. iPhone 16 బేస్ 128GB వేరియంట్ ధర రూ.79,900 నుండి ప్రారంభమవుతుంది.
Apple iPhone 16
కొత్త iPhone 16 కొనుగోలు చేసేటప్పుడు మీ పాత iPhoneని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఎంత ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. గతేడాది రూ.79,900కి విడుదలైన iPhone 15, ధర తగ్గింపు తర్వాత ప్రస్తుతం రూ.69,900కి లభిస్తోంది. మీరు iPhone 15ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే Apple కంపెనీ రూ.37,900 వరకు తగ్గింపు ఇస్తుంది. మీ వద్ద ప్రస్తుతం రూ.59,900 ధర ఉన్న iPhone 14 ఉంటే iPhone 16కి అప్‌గ్రేడ్ చేసుకునేటప్పుడు Apple ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా రూ.32,100 వరకు తగ్గింపు పొందవచ్చు. Apple iPhone 13 సిరీస్‌ను నిలిపివేసినప్పటికీ మీరు దానిని రూ.31,000 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. iPhone 12కి ఎక్స్ఛేంజ్ విలువ రూ.20,800 వరకు ఉంది.
iPhone 16 ధర
ఇది మీ కొత్త iPhone కొనుగోలుపై మంచి తగ్గింపును అందిస్తుంది. ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా మీ పాత iPhone లేదా Android ఫోన్‌కు స్టోర్ క్రెడిట్ లభిస్తుందని గుర్తుంచుకోండి. దానికి బదులుగా మీరు నగదు పొందలేరు. అయితే ఏదైనా కొత్త iPhone కొనుగోలు చేయడానికి మీరు దీనిని ఉపయోగించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫోన్ వాస్తవ ఎక్స్ఛేంజ్ విలువ దాని స్థితిపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు పైన పేర్కొన్న ఎక్స్ఛేంజ్ విలువ మీరు పొందగలిగే గరిష్ట విలువ. అయితే స్క్రీన్ దెబ్బతిన్నా, ఫోన్ ఆన్ కాకపోయినా దాని విలువ తగ్గిపోతుందని గుర్తుంచుకోండి. Apple తాజా iPhone 16 ఇండయాలో భారీ తగ్గింపుతో లభిస్తోంది.
iPhone 16 ఫీచర్లు
దీని ద్వారా కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.50,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 9, 2024న 'It's Glotime' ఈవెంట్‌లో విడుదలైన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం Flipkartలో అద్భుతమైన తగ్గింపుతో లభిస్తోంది. iPhone 16 128GB వేరియంట్ అసలు ధర ఇండియాలో రూ.79,990, అదేవిధంగా 256GB వేరియంట్ ధర రూ.89,990లకు లభిస్తుంది. 512GB వేరియంట్ ధర రూ.1,09,990 మీరు కొనుగోలు చూసుకోవచ్చు.
iPhone 16 ఎక్స్ఛేంజ్ ఆఫర్
ప్రస్తుతం 128GB iPhone 16 మోడల్‌ను Flipkart రూ.48,650కి అందిస్తోంది. ఇది మీ ఫోన్ ఎక్స్ఛేంజ్ తర్వాత ఈ ధరకు లభిస్తుంది. రూ.79,900 ధర కలిగిన iPhone 16(128GB, Ultramarine)ని Amazonలో కొనుగోలు చేయవచ్చు. మీ వద్ద iPhone 15 Plus ఉంటే, అది మంచి స్థితిలో ఉంటే ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మీరు iPhone 16 ని కేవలం రూ.53,650కి తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మీరు రూ.26,250 వరకు ఆదా చేసుకోవచ్చు. అదనంగా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు రూ.5,000 తక్షణ తగ్గింపు కూడా పొందవచ్చు. దీని ద్వారా iPhone 16 ఫైనల్ ధర రూ.48,650కి తగ్గుతుంది. ఇప్పుడే ఈ అద్భుతమైన ఆఫర్ ను ఉపయోగించుకోండి.