ఈ ప్లాన్‌తో ప్రతి నెల పెట్టుబడి : రూ.10 లక్షల కంటే ఎక్కువ డబ్బు రావాలంటే ఇలా చేయండి!
రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ డబ్బు పొందేందుకు చాలా మంది ఎల్‌ఐసి పాలసీ స్కిం తీసుకుంటుంటారు. అయితే LIC జీవన్ ఉమంగ్ పాలసీకి సంబంధించిన ఈ పథకం గురించి మీకు తెలుసా.. చాల మంది రిటైర్మెంట్ అయ్యాక డబ్బును పొదుపు చేసుకుంటారు. మరోకొంత మంది వివిధ వాటిలో డబ్బును పెట్టుబడి పెడుతుంటారు. పదవీ విరమణ తర్వాత ఎక్కువ డబ్బు పొందడానికి చాలా మంది ఎల్‌ఐసి స్కీమ్స్ తీసుకుంటుంటారు.
వీటిలో, LIC జీవన్ ఉమంగ్ యోజన మీ కుటుంబానికి ఆదాయం ఇంకా రక్షణ రెండింటినీ అందిస్తుంది. LIC ప్రీమియం - చెల్లింపు కాలం చివరి నుండి మెచ్యూరిటీ వరకు, ఈ పథకం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ఇంకా మెచ్యూరిటీపై లేదా పాలసీ కాలంలో పాలసీదారుడు మరణించిన సందర్భంలో కూడా ఒకేసారి చెల్లిస్తుంది.
అంతేకాదు LIC జీవన్ ఉమంగ్ పాలసీ స్కీమ్ ఏదైనా లిక్విడిటీ అవసరాలను తీర్చడానికి క్రెడిట్ సౌకర్యాన్ని అందిస్తుంది.
LIC జీవన్ ఉమంగ్ యోజన:
బీమా చేసిన వ్యక్తి బ్రతికి ఉన్నట్లయితే, పాలసీ టర్మ్ చివరిలో ప్లాన్ మొత్తం పై మెచ్యూరిటీ బెనిఫిట్ అందిస్తుంది. LIC పథకం కింద ప్రయోజనాలు ప్రీమియం పేమెంట్ వ్యవధి ముగిసినప్పటి నుండి ప్రారంభమవుతాయి ఇంకా మెచ్యూరిటీ వరకు కొనసాగుతాయి.
LIC జీవన్ ఉమంగ్ యోజన: అర్హత
LIC జీవన్ ఉమంగ్ యోజన కోసం అర్హత వయస్సు 90 రోజులు నుండి గరిష్టంగా 55 సంవత్సరాలు.
పాలసీ వ్యవధి: 100 సంవత్సరాలు
ఈ పథకంలో కనీస హామీ మొత్తం రూ. 2,00,000. నుండి గరిష్ట మొత్తంపై పరిమితి లేదు.
LIC జీవన్ ఉమంగ్ యోజన: కాలిక్యులేటర్
ఇప్పుడు దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవడానికి చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తి పాలసీని తీసుకున్నట్లు ఊహించుకోండి. ప్రతి నెలా రూ.5,000 లేదా ప్రతి 3 నెలలకి రూ. 15,000 లేదా సంవత్సరానికి రూ.50,000. పెట్టుబడి పెట్టవచ్చు.
ఇలా అతను పాలసీ కాలానికి రూ. 10,00,000 చెల్లిస్తాడు. పాలసీదారుడు 20 సంవత్సరాల కాలానికి ప్రీమియం చెల్లించాలి.
రూ.10 లక్షలు అలాగే మెచ్యూరిటీ కాలానికి వడ్డీ లేదా అన్యువల్ బోనస్ మొత్తం ఇవ్వబడుతుందని ఇక్కడ గమనించాలి.
మీకు మరింత పూర్తి సమాచారం కోసం LIC అఫీషియల్ వెబ్ సైట్ చూడవచ్చు.