వడ్డీ లేని రుణం కావాలా? ఈ 5 కేటగిరీల్లో ట్రై చేయండి
వడ్డీ లేని రుణం ఇస్తానంటే ఎవరు తీసుకోరు చెప్పండి.. కాని అలాంటి లోన్ పొందాలంటే బ్యాంకులు చాలా విషయాలు పరిశీలిస్తాయి. వడ్డీ లేని రుణాలు తీసుకోవాలని రిటైల్ వ్యాపారుల నుండి వ్యవసాయం చేసే వారి వరకు అంతా కోరుకుంటారు. కాని ఈ లోన్స్ కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ గురించి చాలా మందికి తెలియవు. వడ్డీ లేని రుణాలు ఎలా పొందాలి. ఎవరెవరికి ఇస్తారు? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి.
అందరికీ డబ్బుతో అవసరం ఉంటుంది. అయితే చాలా మంది అధిక వడ్డీకి అప్పులు తీసుకొని అవసరాలు తీర్చుకుంటారు. కొన్నిసార్లు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతుంటారు. చాలా సందర్భాల్లో అధిక వడ్డీలు కట్టలేని వారు ఆత్మహత్యలు వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్న వార్తలు కూడా మనం చూస్తుంటాం. కాని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఎలాంటి వడ్డీ లేకుండా డబ్బును అప్పుగా తీసుకోవచ్చని. బ్యాంకులు, సంస్థలు కొన్ని షరతులు పెడతాయి. వాటికి అనుగుణంగా డాక్యుమెంట్లు సమర్పిస్తే ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు పొందవచ్చు.
1. రిటైల్ వ్యాపారంలో మీరు వడ్డీ లేని రుణం పొందవచ్చు. అంటే వడ్డీ లేని EMI స్కీమ్ ల ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ తదితర ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి వడ్డీ లేని రుణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్ ట్రా వడ్డీ లేకుండా తయారీ ధరనే ఇన్ స్టాల్మెంట్స్ లో చెల్లించవచ్చు. ఉదాహరణకు మీరు రూ. 60,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను 12 నెలల్లో రూ. 5,000 చొప్పున కట్టి కొనుక్కోవచ్చు.
2. రైతులు వివిధ ప్రభుత్వ పథకాల కింద వడ్డీ లేని రుణాలు పొందవచ్చు. ఈ లోన్స్ ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయవచ్చు. వ్యవసాయ పరికరాలను కొనడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు. సకాలంలో తిరిగి చెల్లించడం వల్ల ఎలాంటి జరిమానాలు ఉండవు. ఇది రైతులకు ఎంతో సహాయం చేసే రుణాలు. వీటిని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి.
3. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అత్యవసర వైద్య ఖర్చులు, విద్య, తదితర అత్యవసర వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాయి. ఇవి కష్ట సమయాల్లో ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందిస్తాయి. సామాజిక అభివఈద్ధి కోసం వడ్డీ లేని రుణాలను అందించడంలో కొన్ని మైక్రోఫైనాన్స్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రుణాలు చిన్న వ్యాపారవేత్తలు, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే మహిళలకు ఉపయోగపడే విధంగా అమలు చేస్తున్నారు.
4. వెనుకబడిన వర్గాల వారు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు ఇస్తుంటాయి. మీరు వీటికి అర్హులేమో చెక్ చేసుకొని తీసుకోవచ్చు.
5. ఇవేకాకుండా క్రెడిట్ కార్డులు కూడా తరచుగా సున్నా వడ్డీ EMI ఎంపికలతో రుణాలు ఇస్తుంటాయి. ఈ ఆఫర్‌లు కార్డ్ హోల్డర్లు షరతులకు అనుగుణంగా ఉంటే వడ్డీ చెల్లించకుండా మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అందువల్ల మీకు వడ్డీ లేని లోన్ కావాలనుకుంటే ఈ కేటగిరీల్లో దేనికి మీరు అర్హులైతే వాటికి అప్లై చేసుకొని పొందొచ్చు.