- Home
- Business
- Hydrogen Train: పెట్రోల్, డీజిల్ అవసరమే లేదు.. 200 కి.మీ. స్పీడ్ తో నడిచే హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది
Hydrogen Train: పెట్రోల్, డీజిల్ అవసరమే లేదు.. 200 కి.మీ. స్పీడ్ తో నడిచే హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది
Hydrogen Train: ఇండియాలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఆ జాబితాలో చేరనుంది. ఈ రైలు ఏ రాష్ట్రంలో, ఏఏ నగరాల మధ్య నడుస్తుంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే ఒకటి. మన దేశంలో ప్రతిరోజూ 19 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇక్కడ డీజిల్‌తో నడిచే రైళ్లు, విద్యుత్‌తో నడిచే రైళ్లు ఎక్కువ. కొన్ని చోట్ల ఆవిరితో నడిచే రైళ్లు కూడా ఉన్నాయి.
ఇండియాలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఈ నెల అంటే మార్చి లోనే ప్రారంభమవుతుందని సమాచారం. ఈ హైడ్రోజన్ రైలుకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. పర్యావరణానికి ఎలాంటి కాలుష్యం కలగని విధంగా వీటిని తయారు చేస్తున్నారు.
మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఢిల్లీ డివిజన్‌లో 89 కి.మీ దూరంలో ఉన్న జింద్ - సోనిపట్ మధ్య నడుస్తుందని సమాచారం. ఇది గంటకు 140 కి.మీ నుండి 200 కి.మీ వరకు వేగంతో వెళుతుంది. హైడ్రోజన్ రైలు 1500 హార్స్ పవర్ సామర్థ్యంతో తయారైంది.
మొట్టమొదటి హైడ్రోజన్ రైలును చెన్నైలోని పెరంబూర్‌లోని బోగీలు తయారు చేసే ఫ్యాక్టరీలో తయారుచేశారు.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో 500 నుంచి 600 హార్స్‌పవర్ కలిగిన హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండగా, భారతదేశంలో 1500 హార్స్‌పవర్ కలిగిన రైళ్లు నడవనుండటం విశేషం. ఒక హైడ్రోజన్ ఇంధన రైలును తయారు చేయడానికి 80 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. భారత ప్రభుత్వం మొత్తం 2 వేల 800 కోట్ల రూపాయలతో 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి 9 రాష్ట్రాలు.. 4,189 కి.మీ.. 74 గంటల ప్రయాణం.. ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్ ఇదే
హైడ్రోజన్ రైలు నడుస్తున్న దేశాలు
ఇండియాలో నడవనున్న హైడ్రోజన్ రైలులో 10 బోగీలు ఉంటాయి. ఇతర దేశాల్లో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఇన్ని బోగీలు ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంగ్లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశం కూడా ఈ జాబితాలో చేరుతుంది.
ఇది కూడా చదవండి హైడ్రోజన్ తో నడిచే లారీలు వచ్చేస్తున్నాయ్. ఒక్కసారి ఫిల్ చేస్తే 500 కి.మీ నాన్ స్టాప్