- Home
- Business
- దేశ ఆర్థిక వృద్ధి రేటును మళ్లీ తగ్గించిన ఏడిబి.. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రీ-బడ్జెట్ సమావేశాలు..
దేశ ఆర్థిక వృద్ధి రేటును మళ్లీ తగ్గించిన ఏడిబి.. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రీ-బడ్జెట్ సమావేశాలు..
ఒకవైపు ప్రభుత్వం, ఇతర రేటింగ్ ఏజెన్సీలు భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు(economy growth rate)ను సవరించడం ద్వారా అంచనాలను పెంచుతున్నాయి. మరోవైపు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 కోసం భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను మూడు నెలల్లో రెండవసారి 9.7 శాతానికి తగ్గించింది.

అంచనాను తగ్గించడానికి కారణం
ADB తన నివేదికను విడుదల చేశాక అంచనాను తగ్గించడానికి ప్రధాన కారణాన్ని పేర్కొంది. పరిశ్రమల ముందు సరఫరా సంబంధిత అడ్డంకులే ఇందుకు కారణమని బ్యాంకు తరుపున చెబుతున్నారు. సరఫరా చైన్ పరిమితుల కారణంగా పరిశ్రమలు దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొంది. విశేషమేమిటంటే, అంతకుముందు సెప్టెంబర్‌లో తన నివేదికలో, 2021-22లో ఆర్థిక వృద్ధి రేటు 10 శాతంగా ఉంటుందని ADB అంచనా వేసింది. ఆసియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ 2021 పేరుతో ఒక నివేదికలో మల్టీ లాటరల్ సంస్థ 2021లో దక్షిణాసియా వృద్ధి రేటు 8.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అలాగే సెప్టెంబరులో 8.8 శాతంగా అంచనా వేసింది.
మూడు నెలల్లో రెండోసారి
ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆర్థిక వృద్ధి అంచనాను మూడు నెలల్లో రెండోసారి సవరించింది. కరోనా మహమ్మారి రెండవ వేవ్ ప్రతికూల ప్రభావాలను ఉటంకిస్తూ, సెప్టెంబర్ నెలలో ఏడిబి దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 10 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు 11 శాతంగా అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఇప్పుడు 9.7 శాతంగా ఉంటుందని ఏడిబి నివేదిక పేర్కొంది. అంటే గత అంచనా కంటే 0.3 శాతం తక్కువ.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసిన సమాచారం ప్రకారం రేపటి నుండి అంటే 15 డిసెంబర్ 2021 నుండి రాబోయే బడ్జెట్‌కు సంబంధించి మేధోమథనం ప్రారంభం కానుంది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశాలను ప్రారంభించబోతున్నారని ట్వీట్‌లో తెలిపారు.
దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారంలో ఈ ప్రీ-బడ్జెట్ సంప్రదింపు సమావేశాలు వర్చువల్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతాయని తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ ద్వారా ఈ సమాచారం తెలియజేసింది.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
2022-23 సంవత్సరానికి బడ్జెట్ సమర్పణకు ఇంకా రెండు నెలల కంటే తక్కువ సమయం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ రంగం, ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమ, పరిశ్రమల ప్రతినిధులు, ఆరోగ్యం, విద్యా రంగ నిపుణులు, ఆర్థికవేత్తలు, కార్మిక సంఘాల నేతలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌ల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఆర్థిక మంత్రిగా నాలుగో బడ్జెట్
ఈ బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాల్గవ బడ్జెట్ గా ప్రదర్శించనున్నారు. ఆమే జూలై 2019లో తన మొదటి బడ్జెట్‌ను సమర్పించారు, రెండు నెలల్లో ఆర్థిక వ్యవస్థపై సంక్షోభం దృష్ట్యా కార్పొరేట్ పన్ను తగ్గింపును ప్రకటించాల్సి వచ్చింది.