- Home
- Business
- ప్రపంచంలో ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువగా అమ్ముడయ్యేది ఇండియాలోనే! రెండో ఏడాది కూడా రికార్డే
ప్రపంచంలో ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువగా అమ్ముడయ్యేది ఇండియాలోనే! రెండో ఏడాది కూడా రికార్డే
Electric Auto: ఇండియా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలకు అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. చైనాను కూడా దాటి లక్షల వెహికల్స్ ఇండియాలో అమ్ముడయ్యాయి. దేశంలో ఎలక్టిక్ ఆటోలు ఎన్నున్నాయో తెలుసుకుందామా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ ఆటోలు
పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ప్రైవేటు వాహనాలైన కార్లు, బైకులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వెర్షన్లలో తయారవుతున్నాయి. ఇప్పుడు ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ అయిన బస్సులు, లారీలు, ఆటోలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కి వినియోగిస్తున్నాయి.
పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ
చాలా దేశాల్లో లారీలు, బస్సులు ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మారిపోయాయి. జనం రవాణా కోసమే కాకుండా, వాణిజ్య రంగంలోనూ అధికంగా వీటిని ఉపయోగిస్తున్నారు. టాటా, మహీంద్రా లాంటి పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే పెద్ద వాహనాల తయారీపై దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోల తయారీ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.
పెట్రోల్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలు
మన దేశంలో ఆటోలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తక్కువ ఖర్చులో, సౌకర్యవంతంగా గమ్యస్థానికి చేర్చే ఏకైక ట్రాన్స్ పోర్ట్ వెహికల్ ఆటో. కొన్ని దశాబ్దాలుగా పెట్రోల్, డీజిల్ ఆటోలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడు వీటి స్థానాన్ని ఎలక్ట్రిక్ ఆటోలు భర్తీ చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సాధారణ ఆటోల కంటే ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువగా తయారవుతున్నాయి. రోడ్లపై కూడా అవే ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ ఆటోలకి అతిపెద్ద మార్కెట్ ఇండియా
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలకు భారత్ అతిపెద్ద మార్కెట్ గా అవతరించింది. వరుసగా రెండో ఏడాది కూడా ఇండియా ఎలక్ట్రిక్ ఆటోలకి అతిపెద్ద మార్కెట్ గా నిలిచింది.
గత ఏడాది అమ్మకాలు 20% పెరిగి 7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఈ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్.
చైనా, ఇండియాల్లోనే 90% ఆటో అమ్మకాలు
ప్రపంచ ఆటో మార్కెట్ 5 % తగ్గినా ఎలక్ట్రిక్ ఆటో అమ్మకాలు మాత్రం 10% పెరిగి 10 లక్షలకు చేరతాయని అంచనా.
చైనా, ఇండియాల్లోనే 90% ఆటో అమ్మకాలు జరుగుతున్నాయి. 2023లో ఇండియా, చైనాను దాటి అతిపెద్ద ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్‌గా అవతరించింది. 2024లో ఎలక్ట్రిక్ ఆటో అమ్మకాలు 57% వాటా సాధించాయి. PM e-Drive స్కీమ్ ద్వారా ఈ వృద్ధికి మరింత ఊపు వచ్చింది.