- Home
- Business
- Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో ఏదైనా కాలేజీ దగ్గర ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే లక్షల్లో ఆదాయం పక్కా..
Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో ఏదైనా కాలేజీ దగ్గర ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే లక్షల్లో ఆదాయం పక్కా..
వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా, అయితే తక్కువ పెట్టుబడితోనే చక్కటి బిజినెస్ చేస్తే మీరు నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు ఏం చేయాలో తెలుసుకుందాం.

వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే చిన్న పెట్టుబడి తోనే మీరు మంచి లాభాలు సంపాదించే వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇందుకోసం పెట్టుబడి గురించి కూడా మీరు ఆలోచించాల్సిన పనిలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ముద్రా రుణాల పథకం ద్వారా కూడా మీరు కావలసినంత పెట్టుబడిని రుణంగా పొందవచ్చు. ప్రస్తుతం అలాంటి వ్యాపార అవకాశం గురించి తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో యువతీ యువకులు ఎక్కువగా కాఫీ షాప్స్ కు అలవాటు పడుతున్నారు. దీన్నే మీరు మంచి వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. కాఫీ షాప్ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుందా, అని మీకు అనిపించవచ్చు కానీ పెద్ద నగరాల్లోనే కాదు కాదు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఈ కాఫీ షాప్ కల్చర్ విస్తరిస్తోంది. కాఫీ షాపుల్లో యువతీ యువకులు ఎక్కువసేపు చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ ఆడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు. అలాగే వారికి కావాల్సిన కాఫీ, ఫాస్ట్ ఫుడ్, ఇతర కూల్ డ్రింక్స్ వంటివి అందుబాటులో ఉంచితే మీ కాఫీ షాప్ సూపర్ హిట్ అవుతుంది.
ఇప్పుడు కాఫీ షాప్ ఏర్పాటుకు ఏం కావాలో తెలుసుకుందాం. ముందుగా కాఫీ షాప్ ఏర్పాటుకు కనీసం ఐదు టేబుల్ పట్టేంత స్థలం అవసరం అవుతుంది. అంటే దాదాపు 500 నుంచి 700 చదరపు అడుగుల షాపు అవసరం అవుతుంది. ఇందులో కొంత భాగం కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి. షాపు ఎదుట ఖాళీ స్థలం ఉంటే మరింత మంచిది. అందులో మీరు మరిన్ని టేబుళ్లను ఏర్పాటు చేసి కాఫీ షాపును విస్తరించవచ్చు.
ఇక ఈ కాఫీ షాపులో అందుబాటులో ఉంచాల్సిన ఫుడ్ విషయానికి వస్తే చైనీస్, కాంటినెంటల్ ఇతర ఫాస్ట్ ఫుడ్స్ ను అందుబాటులో ఉంచాలి. అప్పుడే యువతీ యువకులు కొత్త రుచులను చూసేందుకు మీ కాఫీ షాపుకు వస్తారు. ఇంకా కాఫీ తయారీ కోసం కాఫీ యంత్రాన్ని కొనుగోలు చేసుకోవాలి. ఇందులో కేపచినో, హాట్ చాక్లెట్ వంటి ఫ్లేవర్లను అందుబాటులో ఉంచాలి. అప్పుడే యువతీ యువకులు మీ కాఫీ షాపుకు వస్తారు.
ఇక ఈ కాఫీ షాపును కాలేజీలు ఇతర జన సమర్థం ఉన్న స్థలాల్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది. అప్పుడే ప్రజలు ఎక్కువగా నీ కాఫీ షాప్ వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా కాలేజీలు ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటే మీ కాఫీ షాప్ చక్కగా వర్కౌట్ అవుతుంది.
ఇక కాఫీ షాపుల్లో లాభం పొందాలంటే మంచి మ్యూజిక్ సిస్టం కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే యువతీ యువకులను ఆకర్షించేలా కాఫీ షాపును డిజైన్ చేసుకోవాలి. రెగ్యులర్ రెస్టారెంట్ల మాదిరి కాకుండా, కాస్త వెరైటీగా కొత్త డిజైన్లతో కాఫీ షాపును ఏర్పాటు చేసుకుంటే యువతీ యువకులను ఆకర్షించవచ్చు. అంతేకాదు మీ పెట్టుబడికి తగ్గ ఆదాయం కూడా లభిస్తుంది. కొన్ని బడా కంపెనీలు కాఫీ షాప్స్ ఫ్రాంచైజీలను కూడా అందిస్తున్నాయి. ఇందులో కాఫీ డే లాంటి ప్రముఖ చైన్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా మీరు ఈ కాఫీ షాపులను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా మీకు బ్రాండింగ్ వస్తుంది.