MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Business Ideas: వేసవి కాలంలో లాభాలు కురిపించే ఐస్ క్రీం పార్లర్ బిజినెస్ ప్లాన్, పెట్టుబడి ఎంత, లాభం ఎంత..?

Business Ideas: వేసవి కాలంలో లాభాలు కురిపించే ఐస్ క్రీం పార్లర్ బిజినెస్ ప్లాన్, పెట్టుబడి ఎంత, లాభం ఎంత..?

Ice-Cream Parlour Business: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలతో అనేక వ్యాపారాలను నెలకొల్పి యువత ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా చిన్న వ్యాపారాలతోనే చక్కటి సంపాదన పొందే వీలుంది. అలాంటి వ్యాపారాల్లో ఒకటి ఐస్ క్రీం పార్లర్ బిజినెస్ దీని ద్వారా వేసవి కాలంతో పాటు ఇతర కాలాల్లో సైతం మంచి ఆదాయం పొందవచ్చు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 10 2022, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Business Ideas: కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత కోసం అనేక ఆర్థిక సహాయ పథకాలను రూపొందించింది. ఇందుకోసం ముద్ర రుణాలను విరివిగా అందించింది. ముఖ్యంగా శిశు ముద్ర రుణాలు చిరు వ్యాపారులకు ఉపాధి సృష్టించడానికి ఈ రుణాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. శిశు ముద్ర రుణం కింద వ్యాపారం ప్రారంభించడానికి రూ. 50,000 వరకు రుణం పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మీరు అలాంటి చిరు వ్యాపారం స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లయితే, తక్కువ పెట్టుబడితో  ప్రతి నెలా భారీ సంపాదన పొందే అవకాశం ఉంది. మేము మీకు అలాంటి వ్యాపారాన్ని చెబుతున్నాము, అందులో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎవర్ గ్రీన్ సీజనల్ వ్యాపారం. కేవలం రూ. 50,000 పెట్టుబడితో దీన్ని ప్రారంభించవచ్చు. ఆ బిజినెస్ మరేదో కాదు ఐస్ క్రీమ్ పార్లర్ గురించి మాట్లాడుతున్నాము. దేశంలో ఐస్ క్రీమ్ ప్రియుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎండాకాలం కాకుండా చలికాలంలో కూడా ఐస్ క్రీం తినే వారు ఉన్నారు.
 

36

ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు కావలసిందల్లా ఫ్రీజర్. మీరు ఎక్కడైనా దుకాణాన్ని అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రారంభించవచ్చు. ఇది కాకుండా, ఐస్ క్రీమ్ పార్లర్ తెరవడానికి 400 నుండి 500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా స్థలం సరిపోతుంది. ఇందులో 5 నుంచి 10 మందికి సీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ వ్యాపారం వేగంగా నడుస్తుంటే, దానిలో మరింత వృద్ధికి అవకాశం ఉంది.

46
FSSAI నుండి లైసెన్స్ తీసుకోవడం అవసరం

FSSAI నుండి లైసెన్స్ తీసుకోవడం అవసరం

2022 నాటికి దేశంలో ఐస్ క్రీం వ్యాపారం ఒక బిలియన్ డాలర్లను దాటుతుందని ట్రేడ్ బాడీ ఫిక్కీ ఒక నివేదికలో పేర్కొంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీరు FSSAI నుండి లైసెన్స్ పొందాలి. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్, ఇది ఇక్కడ తయారు చేయబడిన ఆహార పదార్థాలు FSSAI యొక్క నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది.

56

మీరు ఐస్ క్రీం వ్యాపారం చేయడానికి అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ యొక్క ఫ్రాంచైజీని కూడా తీసుకోవచ్చు. దీని కోసం, కనీసం 300 చదరపు అడుగుల స్థలం అవసరం. మీకు తగినంత స్థలం ఉంటే, మీరు ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి retail@amul.coopకి ఇమెయిల్ చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ లింక్ amul.com సందర్శించడం ద్వారా కూడా మీరు సమాచారాన్ని పొందవచ్చు.

66

ఐస్ క్రీం బిజినెస్ కోసం కేవలం షాపు అద్దెకు తీసుకుంటేనే నడుస్తుంది అనుకోవద్దు, షాపింగ్ మాల్స్, అలాగే ఇతర కమర్షియల్ సెంటర్లలో చిన్న ఐస్ క్రీం పార్లర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా కస్టమర్ల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Recommended image2
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image3
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved