- Home
- Business
- మీకు హ్యుందయ్ వెన్యూ కారు ఇష్టమా? క్రెటా స్టైల్లో వెన్యూ న్యూ వెర్షన్ రెడీ: రిలీజ్ ఎప్పుడంటే..
మీకు హ్యుందయ్ వెన్యూ కారు ఇష్టమా? క్రెటా స్టైల్లో వెన్యూ న్యూ వెర్షన్ రెడీ: రిలీజ్ ఎప్పుడంటే..
హ్యుండై కంపెనీకి చెందిన వెన్యూ(Venue) ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ఇదే మోడల్ కారు కొత్త వెర్షన్ రిలీజ్ చేయడానికి హ్యుండై కంపెనీ సిద్ధమవుతోంది. మరి ఈ మోడల్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందామా?

వేన్యూ సెకండ్ జనరేషన్ మోడల్
సౌత్ కొరియా దేశానికి చెందిన ఆటోమొబైల్ కంపెనీ అయిన హ్యుండై ఇప్పటికే పాపులర్ అయిన వెన్యూ(Venue) మోడల్ నుంచి కొత్త వెర్షన్ ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. వేన్యూ సెకండ్ జనరేషన్ మోడల్ ఇది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌లో ఉంది. కొత్త వేన్యూ డిజైన్, ఫీచర్స్‌లో చాలా మార్పులు ఉంటాయని మార్కెట్ నిపుణులు అనుకుంటున్నారు.
క్రెటా లుక్ లో కొత్త వెర్షన్
ఈ సారి వేన్యూ కొత్త వెర్షన్ కి హ్యుండై క్రెటా లుక్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇండియాలో బాగా అమ్ముడయ్యే కార్లలో క్రెటా ఒకటి. నెక్స్ట్ జనరేషన్ వేన్యూలో క్వాడ్-ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, క్రెటా ఎస్‌యూవీలాంటి డీఆర్ఎల్స్ ఉండొచ్చు.
వేన్యూలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి?
హెడ్‌ల్యాంప్స్ కింద ఎల్ షేప్ ఎల్‌ఈడీలు ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ పాలిసేడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్న ఎల్‌ఈడీల్లాగే ఇవి ఉన్నాయి. ఇంకా 'పారామెట్రిక్' గ్రిల్‌ని రెక్టాంగిల్ స్లాట్స్‌తో ఓపెన్ యూనిట్‌గా మార్చే అవకాశం ఉంది. కొత్త హ్యుండై ఎస్‌యూవీలో కొత్త ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉండొచ్చు. ప్రస్తుతం వేన్యూలో లెవెల్ 1 ADAS ఉంది. మహీంద్రా XUV300 లాగా లెవెల్ 2 సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ చేయొచ్చు.
నాలుగు డిస్క్ బ్రేక్‌లు
16 అంగుళాల అల్లాయ్ వీల్స్, థిక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, నాలుగు డిస్క్ బ్రేక్‌లు, ఫ్లాట్ విండో లైన్ డిజైన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వెనకాల రూఫ్ స్పాయిలర్, కొత్త టెయిల్ లైట్స్, బంపర్ మార్చే అవకాశాలున్నాయి. కొత్త వేన్యూ క్యాబిన్ గురించి ఇంకా సమాచారం లేదు. కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయని అనుకుంటున్నారు.
హ్యుండై అల్కాజార్, క్రెటా
హ్యుండై అల్కాజార్, క్రెటా లాగే ఇది కూడా ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్స్ కోసం పెద్ద స్క్రీన్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. త్వరలో రాబోయే వేన్యూలో ప్రస్తుత మోడల్‌లో ఉన్న మూడు ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఇందులో ఉన్నాయి.