Royal Enfield new bikes: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అదిరిపోయే కొత్త బైక్‌లు..!
ప్రముఖ మోటార్ బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్ ఫోలియో విస్తరపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది భారీ సంఖ్యలో కొత్త బైక్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ మోటార్ బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్ ఫోలియో విస్తరపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది భారీ సంఖ్యలో కొత్త బైక్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త బైక్‌లలో ఇప్పటికే కొన్ని ఇప్పటికే టెస్టింగ్ దశకు (Royal Enfield new models) చేరుకున్నట్లు సమాచారం. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గత ఏడాది క్లాసిక్ 350 మార్కెట్లోకి వచ్చింది. అంతకు ముందు సంవత్సరం మిటియర్ 350 మోడల్న విడుదల చేసింది. ఇక ఈ ఏడాది 4 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసే (Four new bikes from Royal Enfield) అవకాశముంది.
సూపర్ మిటియర్ 650 (Royal Enfield Super Meteor 650)
ఇంటర్‌సెప్టర్ 650 కన్నా ప్రీమియం మోడల్‌గా సూపర్ మిటియర్ 650 మోడల్ అందాబుటులోకి రానుంట. ఇందులో 648 సీసీ, ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో రానుంది. ఈ ఇంజిన్ అత్యధికంగా 52 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుందని సమాచారం. ఈ బైక్‌ను ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ సన్నాహాలు చేస్తొంది.
హంటర్ (Royal Enfield Hunter)
బడ్జెట్ సెగ్మెంట్లోని 350 సీసీ రోడ్‌స్టర్ మోటార్ సైకిల్‌ను కూడా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్. ప్రస్తుతం ఈ బైక్‌ను హంటర్ అని పిలిస్తున్నా.. పేరు మార్చే అవకాశాలున్నాయి. ఈ బైక్ విడుదలైన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత చౌకైన మోడల్ కావచ్చని అంచనాలున్నాయి. జూన్, జులై సమయంలో ఈ బైక్ మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.
స్క్రామ్ 411 (Royal Enfield Scram 411)
రాయల్ ఎన్ఫీల్డ్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లోని హిమాలయన్కు అడ్వాన్స్డ్గా ఈ బైక్ రానున్నట్లు సమాచారం. స్క్రామ్ 411 డిజైన్ చాలా వరకు హిమాలయన్ను పోలి ఉండనుందంట. అయితే వీల్స్ మాత్రం కాస్త చిన్నగా ఉండనున్నాయని సమాచారం. ఇంజిన్ సామర్థ్యం కూడా హిమాలయన్ బైక్లానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి.
షాట్‌గన్ 650 (Royal Enfield Shotgun 650)
షాట్‌గన్ 650 సింగిల్ సీటర్ బాబర్. SG650 అనే పేరుతో ఈ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను EICMA 2021లో ప్రదర్శించింది రాయల్ ఎన్ఫీల్డ్. ఇందులో ఇంటర్సెప్టార్ 650, కాంటినెంటల్ జీటీ 650ల్లానే ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉండనుందట. ఈ బైక్ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. కొత్త బైక్‌లతో పాటు.. రాయల్ ఎన్ఫీల్డ్ జే ప్లాట్‌ఫామ్‌పై బుల్లెట్, బుల్లెట్ ఈఎస్ వంటి బైక్‌లను తీసుకురానుంది.