మనుషులు ఇక ముసలివారు అవ్వరా.? జొమాటో సీఈఓ సంచలన ప్రాజెక్ట్
Human Ageing: మనిషి అన్నింటినీ సుసాధ్యం చేస్తున్నాడు. ఒక్క కాలాన్ని జయించడం తప్ప. అయితే ఇప్పుడు ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో జొమాటో సీఈఓ దీపిందర్ ఒక విప్లవాత్మక ప్రాజెక్ట్ ప్రారంభించారు.

మానవ వృద్ధాప్యంపై కొత్త అధ్యాయం
జొమాటో (Zomato) సీఈఓ డీపిందర్ గోయల్ తాజాగా "కంటిన్యూ రీసెర్చ్ (Continue Research)" పేరుతో ఒక విప్లవాత్మక ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన వ్యక్తిగతంగా $25 మిలియన్ (సుమారు రూ. 210 కోట్ల) నిధిని ఏర్పాటు చేశారు. దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా మానవ వృద్ధాప్యం (Human Ageing), దీర్ఘాయుష్షు (Longevity) పై జరుగుతున్న ప్రాథమిక పరిశోధనలకు మద్దతు ఇవ్వడం.
మానవ శరీరం కూడా ఒక సిస్టమ్ అనే ఆలోచన
డీపిందర్ గోయల్ రెండు సంవత్సరాల క్రితం “Continue” పేరుతో ఈ పరిశోధన ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. “మానవ శరీరం కూడా ఒక సిస్టమ్‌లాంటిదే. అందులో కొన్ని సులభమైన ‘లీవర్ పాయింట్లు’ ఉంటాయి. వాటిని సరిగ్గా గుర్తించి మార్చగలిగితే మన వృద్ధాప్యం, జీవన విధానం మారవచ్చు.” ఇదే ఆలోచన ఈ కొత్త నిధికి పునాది అయింది.
So many people keep asking me about Continue. What is it? What are you up to? Here you go...
Continue started as a research effort two years ago, with the belief that if the human body is a system, it should also have its leverage points. The simple levers that, when adjusted,…— Deepinder Goyal (@deepigoyal) October 24, 2025
రెండు రకాల ప్రాజెక్టులకు నిధులు
“కంటిన్యూ రీసెర్చ్” కింద పరిశోధకులకు రెండు రకాల ఫండింగ్ అవకాశాలు ఉంటాయి.
* Moonshots: $50,000 నుంచి $250,000 వరకు నిధులు — కొత్త, రిస్కీ అయినా భవిష్యత్తులో జీవశాస్త్రాన్ని మార్చే ఆలోచనల కోసం.
* Deep Dives: $250,000 నుంచి $2 మిలియన్ వరకు నిధులు — 1 నుంచి 3 సంవత్సరాల వరకు సుదీర్ఘ పరిశోధన చేసే శాస్త్రవేత్తలకు.
ఈ ప్రాజెక్ట్‌లలో ముఖ్యమైన షరతు ఏమిటంటే.. ప్రతి పరిశోధన ఫలితాలు, డేటా, విఫలమైన ప్రయోగాలు కూడా ఓపెన్ సోర్స్‌గా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండాలి.
పబ్లిక్ యాక్సెస్ – పరిశోధన అందరికీ
ఈ ఫండ్‌లో భాగమయ్యే పరిశోధకులు తమ ఫలితాలను దాచుకోవడానికి వీల్లేదు. ఏ పత్రాలు, డేటా లేదా ప్రయోగ పద్ధతులు ఉన్నా అవి పబ్లిక్‌గా అందుబాటులో ఉండాలి. కంటిన్యూ టీమ్ ఏ పబ్లికేషన్ లేదా కంట్రోల్ నియమాలు పెట్టదు. వారు పరిశోధన విలువను చూసి నేరుగా ఫండ్ ఇస్తారు. ఈ విధానం శాస్త్ర ప్రపంచంలో పారదర్శకతను పెంచుతుంది.
లక్ష్యం ఏంటంటే.?
డీపిందర్ గోయల్ ఈ ప్రాజెక్ట్ ద్వారా “మరణాన్ని జయించడం” కాదు, “ఆరోగ్యవంతమైన జీవన కాలాన్ని పొడిగించడం” లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మాటల్లో.. “మనుషులు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బ్రతికితే, వారు తక్షణ ప్రయోజనాలకంటే దీర్ఘకాల ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు.” ఈ పరిశోధన ఫలితాలు మన తరం కంటే తరువాతి తరాలకే ఎక్కువగా ఉపయోగపడతాయని ఆయన చెప్పుకొచ్చారు.