Business Ideas: సాయంకాలం నాలుగు గంటలు కష్టపడితే చాలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కన్నా ఎక్కువ ఆదాయం మీ సొంతం..
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలతో యువత అనేక వ్యాపారాలను ప్రారంభించి, చక్కటి ఆదాయాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కూడా కొందరు యువకులు సొంత వ్యాపారాలు చేయడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. అలాంటి ఎక్కువ ఆదాయం అందించే బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం.
వ్యాపారం చేయడమే లక్ష్యమా.. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా, చక్కటి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని, లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ప్రస్తుతం ఉంది. అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యువతకు వ్యాపారం చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా ముద్రా రుణాలను అందిస్తోంది. ఈ రుణాలు పొందడం ద్వారా యువత చక్కటి వ్యాపారాలు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. మీరు కూడా అలాంటి వ్యాపారం చేయాలి, అనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
వ్యాపారం చేయాలంటే ఫుడ్ బిజినెస్ లభించిన అవకాశం మరొకటి లేదనే చెప్పాలి. ఎప్పటికీ డిమాండ్ బిజినెస్ ఇదే. సాయంకాలం పూట చిరుతిండ్లను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మీరు కూడా దీన్నే వ్యాపార అవకాశంగా మలుచుకుని చక్కటి ఆదాయం పొందవచ్చు.
కొత్త కొత్త చిరుతిండ్లను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మలుచుకుని చక్కటి ఆదాయం పొందే వీలుంది. మహారాష్ట్రలో చాలా ఫేమస్ చిరుతిండి అయిన, వడ పావ్, పావ్ భాజీ బిజినెస్ చేయడం ద్వారా మీరు కూడా చక్కటి ఆదాయం పొందవచ్చు. ముంబైలో ఈ వడ పావ్, పావ్ బాజీ బిజినెస్ చాలా ఫేమస్.. ప్రస్తుత కాలంలో చాలా మంది పావ్ భాజీ, vada pav తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఈ పావ్ భాజీ వడా పావ్ సెంటర్ ప్రారంభించేందుకు మీరు స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్, లేదా ఒక షాపు అద్దెకు తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు. పని వాళ్ళ పై ఆధారపడే కన్నా మీరే పావ్ భాజీ, వడ పావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకొని వ్యాపారం ప్రారంభిస్తే మరింత లాభం పొందే అవకాశం ఉంది. హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు, కుకరీ క్లాసుల ద్వారా పావ్ భాజీ, వడపావ్ తయారీ తెలుసుకోవచ్చు.
ఇక పావు భాజీ తయారీకి కావలసింది చిన్న సైజు బన్నులు, వీటిని ఏదైనా బేకరీ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే నాణ్యమైన మసాలాలను కూడా హోల్సేల్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఉల్లిపాయలు వీటిని కూడా హోల్ సేల్ మార్కెట్ ద్వారా అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వంటకాలు తయారు చేసుకుంటే మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది.
అలాగే ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలి. కమర్షియల్ వంటసామాన్లు కూడా కొనుగోలు చేయాలి. ఎందుకు అతి తక్కువగా 25 వేల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. షాపు అద్దె అదనం. స్థానిక మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ కూడా తీసుకోవాలి. సాయంకాలం పూట ఈ వ్యాపారం చక్కగా నడుస్తుంది. షాపు ముందు కూర్చునేందుకు టేబుళ్లు కుర్చీలు కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా వస్తాయి. అదనంగా కూల్ డ్రింకులను కూడా విక్రయించవచ్చు. వ్యాపారం బాగుంటే మెనూ కార్డులో ఇతర చాట్ బండార్ తినుబండారాలను కూడా తయారుచేసి విక్రయించవచ్చు.