MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • ఎవరికైనా ఫోన్ చేస్తే ‘జాగ్రత్తగా ఉండండి.’యాడ్ వినిపిస్తోందా? దీన్ని ఇలా కట్ చేయండి

ఎవరికైనా ఫోన్ చేస్తే ‘జాగ్రత్తగా ఉండండి.’యాడ్ వినిపిస్తోందా? దీన్ని ఇలా కట్ చేయండి

‘జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు లేదా తెలియని సమూహాల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? వాళ్లు సైబర్ నేరగాళ్లు కావొచ్చు.’ ఈ మ్యాటర్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. ఇటీవల ఎవరికి ఫోన్ చేద్దామన్నా కాలర్ ట్యూన్ కంటే ముందు వస్తున్న ప్రభుత్వ యాడ్ ఇది. ఈ యాడ్ ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ను ప్రజలకు అందిస్తున్నారు. అయితే అర్జెంట్ గా ఫోన్ చేయాల్సిన టైమ్ లో ఇలాంటి యాడ్స్ చాలా డిస్టర్బ్ చేస్తాయి కదా.. అలాంటప్పుడు ఈ యాడ్ ని రాకుండా చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 21 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం సొసైటీలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకులు, పోలీసులు, వివిధ కంపెనీల పేర్లు చెప్పి మంచిగా మాట్లాడి అకౌంట్లలో డబ్బులన్నీ దోచేస్తున్నారు. ఒక్కోసారి సిమ్ కనెక్షన్ తొలగిస్తామని భయపెట్టి బ్యాంకు అకౌంట్ డీటైల్స్ తీసేసుకుంటున్నారు. తీసుకున్న నిమిషాల్లోనే ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. అప్ డేట్ అయిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇవే కాకుండా వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫాం ల ద్వారా ఫోటోలు, వీడియోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి తిరిగి సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తామని బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సెక్సువల్ హరాస్మెంట్స్ కి కూడా గురవుతున్నారు. 
 

35

ఇలాంటి మోసాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడానికే టెలికాం కంపెనీలు ఫోన్ రింగ్ అవ్వడానికి ముందుగా సైబర్ మోసాలను వివరిస్తూ యాడ్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సమాచారం చాలా విలువైనది. అయితే అత్యవసరంగా ఎవరికైనా కాల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యాడ్ వస్తే ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ యాడ్ పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే ఫోన్ రింగ్ అవడం ప్రారంభమవుతుంది. 

45

అంటే సుమారు 20 సెకన్లు మీరు ఓపిగ్గా యాడ్ మొత్తం వినాల్సి ఉంటుంది. మామూలు టైమ్ లో అయితే పర్లేదు కాని అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ యాడ్ పదే పదే వస్తోంది. ఇది ఒకరకంగా ఇబ్బంది పెట్టే విషయం. 

అందువల్ల మీరు ఈ యాడ్ ను కట్ చేయాలి అనుకుంటే ఈ చిన్న టెక్నిక్ ను ఫాలో అవ్వండి. ఈజీగా యాడ్ ఆగిపోతుంది. 

55

ఈ సారి మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు ‘జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు లేదా తెలియని సమూహాల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? వాళ్లు సైబర్ నేరగాళ్లు కావొచ్చు.’ అంటూ యాడ్ వస్తే వెంటనే ఫోన్ లో కీ ప్యాడ్ ఓపెన్ చేయండి.

అందులో # కీపై క్లిక్ చేయండి. వెంటనే యాడ్ వాయిస్ ఆగిపోయి కాల్ రింగ్ అవడం ప్రారంభమవుతుంది. దీంతో వెంటనే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image2
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image3
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved