మీ యూపిఐ పేమెంట్ సేఫ్ గా వుండాలంటే... ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి
మీరు స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించిన యూపిఐ యాప్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నాయి. అయితే మీరు తప్పకుండా కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాల్సిందే. అవేంటో తెలుసుకుందాం...
upi payment
యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతదేశ ఆర్థిక వ్యవహారాలను ఎంతలా మార్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ వుంటేచాలు మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బును బదిలీ చేయవచ్చు, బిల్లులు చెల్లించవచ్చు, కొనుగోళ్లు చేయవచ్చు. ఇలా యూపిఐ రోజువారి ఆర్థిక లావాదేవీలు, ఇతర అవసరాలకు ఉపయోగపడటంతో చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్లింది.
అయితే ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లాగే యూపిఐ వాడకంలో భద్రత కూడా చాలా ముఖ్యం. రోజువారి లావాదేవీల కోసం ఎక్కువ మంది యూపిఐ యాప్‌లను ఉపయోగిస్తుండటంతో ఆర్థిక డేటాను రక్షించడం కీలకంగా మారింది. కాబట్టి వినియోగదారులు సురక్షిత UPI లావాదేవీలను ఎలా జరపాలో తెలుసుకోవడం చాలా ముుఖ్యం. ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో మోసపోకుండా ముందే జాగ్రత్తపడితే ఆర్థిక మోసాల నుండి బైటపడవచ్చు.
సురక్షిత యూపిఐ వినియోగ చిట్కాలు :
1. UPI ఎలా పని చేస్తుంది :
భద్రతా చిట్కాలను తెలుసుకునేముందు అసలు యూపిఐ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలాముఖ్యం. యూపిఐ అనేది మీ బ్యాంక్ ఖాతాను మీ స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేస్తుంది. వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా నంబర్‌కు ప్రత్యామ్నాయంగా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) సృష్టిస్తారు. చెల్లింపులు చేసేటప్పుడు,
సున్నితమైన బ్యాంక్ వివరాలను పంచుకోకుండా యూపిఐ ఐడి ఉపయోగించబడుతుంది. తద్వారా డేటా బహిర్గతం అవ్వకుండా నివారించబడుతుంది.
యూపిఐ అనేది టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, లావాదేవీ ఎన్క్రిప్షన్, వన్ టైమ్ పాస్‌వర్డ్‌లు (OTP) వంటి అనేక భద్రతా ప్రమాణాలతో పని చేస్తుంది. కానీ
వినియోగదారులు తమ క్రెడెన్షియల్స్‌ని నిర్లక్ష్యం చేసినా, సాధారణ మోసాల గురించి తెలుసుకోకపోయినా...మీ యూపిఐ ద్వారా ఆర్థిక మోసాలకు గురికావచ్చు.
2.సురక్షితమైన UPI యాప్‌ను ఎంచుకోండి :
మీ లావాదేవీలను భద్రతతో చేయడానికి మొదటి అడుగుగా విశ్వసనీయమైన, సురక్షితమైన యూపిఐ యాప్ ను ఎంచుకొండి. పర్యవేక్షణలేని లేదా సందేహాస్పద సోర్స్ నుండి యూపిఐ యాప్ డౌన్ లోడ్ చేయడం మోసాలకు దారితీయవచ్చు. కాబట్టి భద్రతా చర్యలు లేని యూపిఐ యాప్ లను గుర్తించడం చాలాముఖ్యం. ప్రముఖ బ్యాంకులు, ఫిన్ టెక్ కంపెనీలైన బజాజ్ ఫిన్ సెర్వ్ లాంటి సంస్థలు అందించే యూపీఐ యాప్‌లు కట్టుదిట్టమైన రక్షణను కలగి ఉంటాయి... కాబట్టి ఇలాంటివాటిని ఉపయోగించడం మంచిది.
సురక్షిత UPI యాప్‌ను ఎలా గుర్తించాలో ముందు తెలుసుకోవాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నియంత్రణలో ఉన్న, గుర్తింపు పొందిన బ్యాంకులు మద్దతు ఇచ్చే యాప్‌లను ఎంచుకోండి. విశ్వసనీయత, వినియోగదారుల అభిప్రాయాలను యాప్ స్టోర్ లో చూసి మంచి రేటింగ్ వున్న యాప్ లనే ఎంచుకొండి. ఇలా మీరు ఎంచుకున్న యాప్ తరచూ అప్‌డేట్ అవుతుందో లేదో నిర్ధారించుకోండి. యాప్ అప్ టేడ్ అవుతోందంటే డెవలపర్ క్రియాశీలంగా బగ్‌లను సరిదిద్దడం , భద్రతా చర్యలను అమలు చేస్తున్నాడని అర్దం.
3. బలమైన UPI పిన్ సెట్ చేయండి
మీ UPI అకౌంట్ కు బలమైన పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (PIN) ఏర్పాటుచేసుకోవాలి. మీ ఖాతా భద్రతలో ఇది చాలా కీలకం. బలహీనమైన లేదా ఊహించదగిన పిన్ మీ ఖాతాను హ్యాకింగ్‌కు, అనధికార యాక్సెస్‌కు దారితీస్తుంది. దీన్ని నివారించడానికి బలమైన, ఊహించడానికి కష్టమైన పిన్‌ను సృష్టించండి.
బలమైన UPI పిన్ సృష్టించే చిట్కాలు:
సాధారణ కాంబినేషన్లను నివారించండి. ఉదాహరణకు 1234 వంటి వరుస అంకెలను పాస్ వర్డ్ గా అస్సలు పెట్టకండి. అలాగే మీ పుట్టిన సంవత్సరం, ఫోన్ నెంబర్ వంటి సులభంగా ఊహించగల నంబర్లను ఉపయోగించకుండా ఉండండి.
యునిక్ పిన్‌లు: ఒకే పిన్‌ను మీ ఇతర ఖాతాల కోసం (ATM పిన్ లాంటి) వాడవద్దు. ఒక పాస్ వర్డ్ దొంగిలించబడినప్పుడు, ఇతర ఖాతాలపై ప్రభావం చూపకుండా ఉండాలి. మీ పిన్‌ను తరచుగా అప్‌డేట్ చేయండి... తద్వారా అనధికార యాక్సెస్ ను నివారించవచ్చు. మీ UPI పిన్‌ను ఎవరికీ పంచుకోకండి... చివరకు మీ కుటుంబసభ్యులు, స్నేహితులకు కూడా చెప్పకండి.
4. ఫిషింగ్ మోసాలపై బి అలర్ట్ :
ఫిషింగ్ అటాకే అనేది యూపిఐ, యూపిఐ లైట్ వినియోగదారులకు ఎదురయ్యే సాధారణ ప్రమాదాలలో ఒకటి. మోసగాళ్లు బ్యాంకులు, చెల్లింపు యాప్‌ల ప్రతినిధులుగా నటిస్తూ యూపిఐ పిన్, ఓటిపి లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని సేకరించి మోసం చేస్తారు. కేవలం ఫోన్ కాల్‌స్ ద్వారా మాత్రమే కాదు టెక్ట్స్ సందేశాలు, ఇమెయిల్స్ రూపంలో కూడా మోసం చేస్తారు.
ఫిషింగ్ ప్రయత్నాలను ఎలా గుర్తించాలి:
అనుమానాస్పద లింకులు: తెలియని లేదా అనుమానాస్పద నంబర్ల నుండి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకుండా ఉండండి. ఈ లింక్‌లు మీ సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించబడిన నకిలీ వెబ్‌సైట్‌లకు దారితీస్తాయి.
అనుకోని చెల్లింపు అభ్యర్థనలు: మీరు ప్రారంభించని చెల్లింపులను ఎప్పుడూ అనుమతించకండి. మోసగాళ్లు నకిలీ చెల్లింపు అభ్యర్థనలు పంపవచ్చు , వాటినిఅంగీకరించడం వల్ల మీ ఖాతాను ఖాళీ అయిపోవచ్చు.
UPI పిన్ లేదా OTP కోసం అభ్యర్థనలు: ప్రామాణిక సంస్థలు మీ UPI పిన్ లేదా OTPని ఫోన్ కాల్ లేదా సందేశం ద్వారా అడగవు. ఇలాంటి ఏ అభ్యర్థనకూ ప్రతిస్పందించవద్దు. ఓటీపీని చెప్పవద్దు.
5. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ఉపయోగించండి
టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) మీ UPI లావాదేవీలకు అదనపు భద్రతను జోడిస్తుంది. Bajaj Pay టూఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఉపయోగించి లావాదేవీలను సురక్షితం చేస్తుంది. 2FAతో వినియోగదారులు తమ UPI పిన్‌ను నమోదు చేయడంతో పాటు రెండవ ధృవీకరణ దశను పూర్తి చేయాలి. ఇది సాధారణంగా మీ నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు పంపబడిన OTP లేదా ఇన్-యాప్ ధృవీకరణ.
టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ప్రయోజనాలు:
అధిక భద్రత: మీ వద్ద UPI పిన్ ఉన్నప్పటికీ, OTP లేదా రెండవ ధృవీకరణ ఫ్యాక్టర్ లేకుంటే లావాదేవీ పూర్తి చేయడం సాధ్యం కాదు.
రియల్ టైమ్ హెచ్చరికలు: లావాదేవీ ప్రారంభమైనప్పుడు చాలా UPI యాప్‌లు OTPని పంపుతాయి, వినియోగదారులు అనుమానాస్పదమైన లావాదేవీని చూడగలిగితే వెంటనే రద్దుచేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ మొబైల్ నంబరును మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేసి సెక్యూర్ గా ఉంచుకోవాలి. అప్పుడే మీకు ఓటీపీలు, అలెర్ట్ లు వస్తాయి.
6. మీ లావాదేవీలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి
మీ లావాదేవీ హిస్టరీని ట్రాక్‌లో ఉంచడం అనధికార లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడానికి చాలా ముఖ్యం. బజాజ్ పే వంటి UPI యాప్‌లు అన్నిలావాదేవీల రికార్డ్‌ను నిల్వ చేస్తాయి... కాబట్టి వినియోగదారులు తమ చెల్లింపులు, రీచార్జ్‌లు, బదిలీలను సమీక్షించడం సులభం చేస్తుంది.
లావాదేవీల పర్యవేక్షణలో ఉత్తమ పద్ధతులు
స్టేట్‌మెంట్‌లను క్రమంగా తనిఖీ చేయండి: మీ UPI యాప్, యాంక్ ఖాతాలో తరచూ లాగిన్ అవుతూ లావాదేవీ చరిత్రను సమీక్షించండి. మీరు గుర్తించని ఏవైనా లావాదేవీలు కనిపిస్తే వెంటనే వాటిని సంబంధిత బ్యాంక్ ద్వారా క్లారిటీ తీసుకోండి.
ఎస్ఎంఎస్ లేది ఈ-మెయిల్ అలర్ట్స్‌ను ప్రారంభించండి: లావాదేవీ జరిగిన ప్రతీసారి మీ ఖాతా నుండి చెల్లింపు అయినట్లు ఎస్ఎంస్ లేదా ఇమెయిల్ ద్వారా నోటిఫికేషన్‌లు అందుకునే అవకాశం ఉపయోగించుకోండి. ఈ అలర్ట్ ద్వారా అనధికార లావాదేవీలను తక్షణమే గుర్తించే అవకాశం ఇస్తాయి.
ఆటో-డెబిట్ చెల్లింపులను సమీక్షించండి: కొన్ని UPI యాప్‌లు ఆటోమేటిక్ బిల్ చెల్లింపులు లేదా సబ్‌స్క్రిప్షన్‌లను సెటప్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ సౌలభ్యం ఉన్నప్పటికీ అనుకోకుండా ఎలాంటి ఆటో-డెబిట్ లావాదేవీలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యం.
7. యూపిఐ ఉపయోగం తరువాత లాగ్ అవుట్ అవ్వండి :
UPI యాప్‌ల ద్వారా లావాదేవీలు చేసిన తర్వాత యాప్ నుండి లాగ్ అవుట్ అవ్వడం చాలా ముఖ్యం. యాప్‌లు సాధారణంగా ఆటోమేటిక్ టైమ్-అవుట్ ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ, మీరే వ్యక్తిగతంగా లాగ్ అవుట్ అవడం మీ భద్రతకు అదనపు రక్షణను ఇస్తుంది. లావాదేవీ చేసిన తర్వాత UPI యాప్‌లో లాగ్ అవుట్ అవ్వకపోవడం అనేక ప్రమాదాలను కలిగించవచ్చు, ముఖ్యంగా మీ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు.
లాగ్ అవుట్ చేయడానికి ప్రధాన కారణాలు: అనధికార వినియోగాన్ని నివారించడం చాలా ముఖ్యం. మీ ఫోన్‌ను ఉపయోగించి యాప్‌లో లాగ్ అవుట్ కాకపోతే, దొంగలు లేదా ఇతరులు మీ ఫోన్‌కి యాక్సెస్ పొందినప్పుడు మీ UPI యాప్‌కి కూడా సులభంగా యాక్సెస్ పొందగలరు. ఇది మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా యాక్సెస్ కల్పిస్తుంది, కనుక లాగవుట్ అయితే వారు చెల్లింపులు జరపడం సాధ్యం కాదు.
అదనపు అనుమతి : మీరు లాగ్ అవుట్ అయితే యాప్‌లోకి తిరిగి ప్రవేశించడానికి UPI పిన్ లేదా మరో ధృవీకరణ పద్ధతి అవసరం అవుతుంది, ఇది మీ ఖాతాకు పునఃప్రవేశాన్ని కష్టతరం చేస్తుంది.
ముగింపు
UPI రోజువారీ ఆర్థిక కార్యకలాపాలలో కీలకమైన భాగంగా మారుతున్న క్రమంలో మీ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించడం అత్యవసరం. బజాజ్ పే వంటి నమ్మకమైన UPI యాప్‌ను ఎంచుకొని, బలమైన భద్రతా ప్రమాణాలు అమలు చేయండి. ఫిషింగ్ వంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండండి, అలాగే మీ లావాదేవీలను తరచూ పర్యవేక్షించండి.ఈ చర్యలు డిజిటల్ చెల్లింపులతో కూడిన ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి. నిరంతరం అప్డేట్ అవడం, జాగ్రత్తగా ఉండడం ద్వారా, మీరు సౌకర్యవంతమైన, సురక్షిత UPI అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.