MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Personal Loan: జాబ్ లేదా? నో టెన్షన్! ఉద్యోగం లేకపోయినా పర్సనల్ లోన్ పొందే సూపర్ టిప్స్ ఇవే!

Personal Loan: జాబ్ లేదా? నో టెన్షన్! ఉద్యోగం లేకపోయినా పర్సనల్ లోన్ పొందే సూపర్ టిప్స్ ఇవే!

Personal Loan: ఉద్యోగం లేని వారికి కూడా పర్సనల్ లోన్ లభించే అవకాశాలు ఉన్నాయి. మీ క్రెడిట్ స్కోర్, ఇతర ఆదాయ వనరుల ఆధారంగా లోన్ ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 03 2026, 08:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉద్యోగం లేకపోయినా లోన్ వస్తుందా?
Image Credit : Asianet News

ఉద్యోగం లేకపోయినా లోన్ వస్తుందా?

చదువుకైనా, హాస్పిటల్ బిల్లులకైనా, లేదా సడన్ గా ప్లాన్ చేసిన ట్రిప్ కైనా.. చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు గుర్తొచ్చేది పర్సనల్ లోన్. అయితే చాలా మంది మనసులో.. "నాకు ఉద్యోగం లేదు కదా.. నాకు లోన్ వస్తుందా?" లేదా "నా దగ్గర ఆస్తి పత్రాలు లేవు, బ్యాంకులు నన్ను నమ్ముతాయా?" అని తెగ టెన్షన్ పడుతుంటారు. కానీ మీకు జాబ్ లేకపోయినా మీకు లోన్ వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు కేవలం మీ శాలరీ స్లిప్ మాత్రమే చూడటం లేదు. మరి ఏం చూస్తున్నాయి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉద్యోగం లేకపోతే లోన్ రాదా?
Image Credit : Getty

ఉద్యోగం లేకపోతే లోన్ రాదా?

చాలా మంది ఏమనుకుంటారంటే, వైట్ కాలర్ జాబ్ ఉంటేనే బ్యాంకులు లోన్ ఇస్తాయని. ఇది పక్కా అపోహ! మీకు ఫిక్స్‌డ్ శాలరీ లేకపోయినా, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, లేదా ఫ్రీలాన్సర్‌గా సంపాదిస్తున్నా లోన్ పొందే ఛాన్స్ ఉంది. మీ దగ్గర రెగ్యులర్ గా కొంత ఆదాయం వస్తున్నట్లు బ్యాంకర్లను నమ్మిస్తే చాలు. అది మీ వ్యాపారం ద్వారా కావచ్చు లేదా అద్దె రూపంలో వచ్చే డబ్బు కావచ్చు. మీరు లోన్ తిరిగి కట్టగలరనే నమ్మకం కలిగిస్తే, మీ చేతిలో లోన్ అమౌంట్ ఉన్నట్టే అని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Chanchalguda : జైలుకు వెళ్తే రూ.500.. బయటకు వస్తే రూ.1000 ఫైన్! ఏంటా వింత రూల్?
Related image2
Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్ టూ ముంబై 3 గంటల్లోనే.. బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ! ఇక విమానం ఎక్కాల్సిన అవసరం లేదు!
35
సెక్యూరిటీ అవసరం లేదు.. క్రెడిట్ స్కోరే బాస్
Image Credit : Getty

సెక్యూరిటీ అవసరం లేదు.. క్రెడిట్ స్కోరే బాస్

పర్సనల్ లోన్ అనేది ఒక అన్‌సెక్యూర్డ్ లోన్. అంటే దీనికోసం మీ బంగారాన్నో, ఇంటి పట్టానో బ్యాంకులో పెట్టాల్సిన అవసరం లేదు. మరి బ్యాంకులు దేని ఆధారంగా లోన్ ఇస్తాయి? ఇక్కడే మీ క్రెడిట్ స్కోర్ అసలు రోల్ ప్లే చేస్తుంది. 

గతంలో మీరు తీసుకున్న అప్పులు సరిగ్గా కట్టి ఉంటే, మీ స్కోర్ బాగుంటుంది. మీ స్కోర్ గనుక 750 పైన ఉంటే, బ్యాంకులు మీకు రెడ్ కార్పెట్ వేసి మరీ లోన్ ఇస్తాయి. సీనియర్ సిటిజన్లకు కూడా పెన్షన్ ఆధారంగా పర్సనల్ లోన్స్ ఇచ్చే సౌకర్యం ఇప్పుడు అందుబాటులో ఉంది.

45
వడ్డీ రేట్లు భారమా? ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉంది..
Image Credit : Google

వడ్డీ రేట్లు భారమా? ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉంది..

పర్సనల్ లోన్ అనగానే వామ్మో! వడ్డీ ఎక్కువ అని భయపడతారు. నిజమే, హోమ్ లోన్ కంటే దీని వడ్డీ కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ మీరు క్రెడిట్ కార్డుపై తీసుకునే నగదు తో పోలిస్తే ఇది చాలా తక్కువ. క్రెడిట్ కార్డుపై 36% వరకు వడ్డీ ఉంటే, పర్సనల్ లోన్ 12% నుండి 14% మధ్యలోనే లభిస్తుంది. పైగా, మీ క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్‌గా ఉంటే, బ్యాంకులతో బేరమాడి వడ్డీ రేటు తగ్గించుకునే ఛాన్స్ కూడా మీకు ఉంటుంది. షార్ట్ టెర్మ్ లో రుణం తీరిపోతుంది కాబట్టి, ఎక్కువ కాలం భారం ఉండదు.

55
అవసరం ఏదైనా పర్సనల్ లోన్ సిద్ధం
Image Credit : our own

అవసరం ఏదైనా పర్సనల్ లోన్ సిద్ధం

పర్సనల్ లోన్ కేవలం పెళ్లిళ్లకో, ఇల్లు కట్టడానికో మాత్రమే కాదు. మీరు పాత అప్పులు తీర్చాలన్నా, సడన్ గా ఏదైనా గాడ్జెట్ కొనాలన్నా, లేదా విదేశీ ప్రయాణాలకు వెళ్లాలన్నా దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి కండిషన్లు ఉండవు. లోన్ తీసుకునే ముందు మీ రీపేమెంట్ ప్లాన్ పక్కాగా ఉంటే చాలు. బాధ్యతాయుతమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే, పర్సనల్ లోన్ అనేది కష్టకాలంలో మనకు దొరికే ఒక వరం లాంటిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Chanchalguda : జైలుకు వెళ్తే రూ.500.. బయటకు వస్తే రూ.1000 ఫైన్! ఏంటా వింత రూల్?
Recommended image2
Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్ టూ ముంబై 3 గంటల్లోనే.. బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ! ఇక విమానం ఎక్కాల్సిన అవసరం లేదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved