గూగుల్ పే పేమెంట్ హిస్టరీ డిలీట్ చేయవచ్చు ... మీరూ చేయాలనుకుంటున్నారా..? స్టెప్ బై స్టెప్ డిటెయిల్స్
మీరు ఆర్థిక లావాదేవీల కోసం గూగుల్ పే ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ పేమెంట్ యాప్ లో నమోదయిన వివరాలను అంటే పేమెంట్ హిస్టరీని డిలీట్ చేయవచ్చు. అదెలాగో స్టెప్ బై స్టెప్ వివరాలు మీకోసం...
Gpay
Gpay: యూపిఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటెర్ ఫేస్) ... భారత ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కింస్తోందని అనడంలో అతిశయోక్తి లేదు. దేశంలో కరెన్సీ వాడకం తగ్గి ప్రతి ఒక్కరు ఆన్ లైన్ పేమెంట్స్ వైపు మళ్ళడంలో ఈ UPI దే కీలకపాత్ర... ఆర్థిక చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలన్ని ప్రస్తుతం ఈ ప్రక్రియలోనే అత్యధికంగా జరుగుతున్నాయి. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు... సమయంతో సంబంధం లేదు... చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే చాలు... ఈజీగా ఆర్థిక లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు ఈ యూపిఐ యాప్స్ కల్పిస్తాయి.
Gpay
ఈ యూపిఐ సేవల పేరు చేపగ్గానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది గూగుల్ పే, ఫోన్ పే. గుర్తింపుపొందిన బ్యాంక్ లో మీకు బ్యాంక్ అకౌంట్... అందులో డబ్బులు వుంటే చాలు... మీరు ఎప్పుడైనా, ఎవరితోనైనా ఆర్థిక లావాదావేలు జరపవచ్చు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వారితో కూడా క్షణాల్లో డబ్బులు చెల్లించవచ్చు... వారినుండి డబ్బులు పొందవచ్చు.
Gpay
దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఈ యూపిఐ సేవలను ఫోన్ పే లేదంటే గూగుల్ పే ద్వారానే పొందుతున్నారు. అయితే ఈ యాప్స్ ద్వారా మనం జరిపే లావాదేవీల వివరాలు యాప్ లో నమోదవుతాయి. కానీ కొన్ని లావాదేవీల వివరాలను గోప్యంగా వుంచాలనుకు డిలీట్ ఆప్షన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే గూగుల్ పే ద్వారా జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలు కనిపించకుండా చేయవచ్చు... నేరుగా డిలీట్ ఆప్షన్ లేకపోయినా సెట్టింగ్స్ లోకి వెళ్లి ఈ పని చేయవచ్చు. ఇలా గూగుల్ పే లో ట్రాన్సాక్షన్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలాగా స్టేప్ బై స్టేప్ తెలుసుకుందాం.
Gpay
ముందుగా మీ ఫోన్ లోని గూగుల్ పే యాప్ ను ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ కాగానే పైన సెర్చ్ బార్ పక్కన మన ప్రొఫైల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేయండి.
యూపీఐ వివరాలతో కూడిన మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో సెట్టింగ్ ఆప్షన్ ఎంచుకొండి. సెట్టింగ్ పై క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి... అందులో privacy & security క్లిక్ చేయండి. వెంటనే మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి... అందులో మొదటవుండే Data & Personalization పై క్లిక్ చేయండి. అప్పుడు ఓ పేజి ఓపెన్ అవుతుంది...అందులో Google account అని హైలైట్ చేయబడి వుంటుంది. దానిపై క్లిక్ చేయండి.
ఇలా చివరకు 'Manage your Google Pay Experience' పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో కిందకు స్క్రోల్ చేసుకుంటే వెళితే ఈ యాస్ ద్వారా మనం చేసిన లావాదేవీలన్ని కనిపిస్తున్నాయి. ఇందులో మీరు హిస్టరీలో కనిపించకూడదనుకునే లావాదేవీల వివరాలను డిలీట్ చేయవచ్చు. లేదంటే పూర్తి ట్రాన్సక్షన్ వివరాలను కూడా డిలీట్ చేసుకోవచ్చు.
Gpay
ఇలా గూగుల్ పే లో ఎప్పటినుండో జరిపిన వాటితో పాటు తాజాగా చేపట్టిన లావాదేవీలతో వివరాలను కూడా డిలీట్ చేయవచ్చు. గంటలోపు జరిపిన లేదంటే గతరోజు జరిపిన లేంటే ఏ రోజు నుండి ఏ రోజు వరకు జరిపిన లావాదేవీలను డిలీట్ చేయాలో ఎంచుకోవచ్చు. ఇవన్నీ కాదు మొత్తం హిస్టరీ డిలీట్ చేయాలనుకుంటే All time సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయవచ్చు