MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Aadhaar Card: ఆధార్‌ కార్డులో ఉన్న మీ ఫొటో నచ్చడం లేదా.? ఎలా మార్చుకోవాలంటే..

Aadhaar Card: ఆధార్‌ కార్డులో ఉన్న మీ ఫొటో నచ్చడం లేదా.? ఎలా మార్చుకోవాలంటే..

సిమ్‌ కార్డు మొదలు, ఫ్లైట్‌ టికెట్‌ వరకు.. ప్రతీ ఒక్క పనికి ఆధార్‌ కార్డ్‌ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో కచ్చితంగా ఆధార్‌ కార్డు ఉండాల్సిన పరిస్థితి అనివార్యంగా నెలకొంది. అయితే మనలో చాలా మంది ఆధార్‌ కార్డులో ఫొటో బాగా లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఆధార్‌ కార్డులో ఫొటోను ఎలా మార్చుకోవాలి.? ఇందుకోసం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Narender Vaitla | Published : Mar 15 2025, 11:24 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

ఆధార్‌ కార్డు లేకుండా ఇంటి నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. చివరికి బస్సులో ప్రయాణించాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. తెలంగాణలో మహా లక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత ప్రయాణానికి ఆధార్‌ కార్డును చూపించాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆధార్‌ కార్డును తప్పకుండా వెంట తీసుకెళ్తున్నారు. ఆధార్‌ కార్డుపై ఉండే 12 అంకెల కార్డులో మీ బయోమెట్రిక్ డేటా, పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఉంటాయి. 
 

24
Asianet Image

అయితే మనలో చాలా మంది ఆధార్‌ కార్డులో ఉన్న ఫొటోను చూసుకొని నవ్వుకుంటుంటారు. అందులో ఉంది అసలు తామేనా అనే సందేహం వస్తుంటుంది. అయితే ఆధార్‌ కార్డులో ఫొటోను మార్చుకోవడం చాలా సులభమని మీకు తెలుసా.? ఇంతకీ ఆధార్‌ కార్డులో ఫొటోను ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం. 

* ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. 

* ఆ తర్వాత వెబ్‌సైట్‌లో ఆధార్ నమోదు ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. 

* అనంతరం ఫామ్‌లో పేర్కొన్న వివరాలన్నింటినీ అందించాలి. 

* తర్వాత ఫామ్‌ను సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి లేదా ఆధార్ సేవా కేంద్రంలో సమర్పించాలి. 

* ఆధార్ కేంద్రంలో, మీ వేలిముద్ర,  ఐరిష్‌ స్కాన్‌తో పాటు మీ బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు.

* బయోమెట్రిక్‌ వివరాలను నిర్ధారించుకున్న తర్వాత కొత్త ఫొటోను తీసుకుంటారు. 
 

34
Asianet Image

* ఆధార్‌ కేంద్రంలో ఉండే వెబ్‌ క్యామ్‌ ద్వారా కొత్త ఫోటోను తీసుకుంటారు. ఆధార్ కార్డులోని పాత ఫొటోతో ఈ కొత్త ఫొటో భర్తీ అవుతుంది. 

* ఫొటో మార్చుకోవడానికి రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

* అప్‌డేట్‌ చేసిన తర్వాత URN తో పాటు ఒక స్లిప్ ఇస్తారు. ఈ స్లిప్‌లో ఒక నంబర్,లింక్ ఉంటుంది. దీని ద్వారా మీరు మీ దరఖాస్తు స్టేటస్ ను ట్రాక్ చేసుకోవచ్చు.

* కొన్ని రోజుల తర్వాత మీ కార్డులో ఫొటో మారుతుంది. కొత్త ఆధార్‌ కార్డు పోస్ట్‌ ద్వారా మీ ఇంటికి వస్తుంది. లేదంటే యూఐడీఏ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఆధార్‌ కార్డును మీరే స్వయంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

44
Asianet Image

ఆధార్‌ కార్డు ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

* ఇందుకోసం ముందుగా  యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 

* అనంతరం మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. 

* ఆ తర్వాత గెట్‌ ఆధార్ అనే ఆప్సన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అనంతరం డౌన్‌లోడ్‌ ఆధార్‌పై క్లిక్‌ చేయాలి. 

* ఆధార్‌ నెంబర్‌ను సెలక్ట్‌ చేసుకొని. మీ ఆధార్‌ నెంబర్‌తో పాటు క్యాప్చాను ఎంటర్‌ చేయాలి. వెంటనే సెండ్ ఓటీపీపై క్లిక్‌ చేయాలి. 

* మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేయగానే వెంటనే ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ అవుతుంది. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories