సింపుల్‌గా లక్షాధికారి కావాలంటే.. SBIలోని ఈ స్కీమ్ లో చేరండి
లక్షాధికారి కావాలని అందరూ కోరుకుంటారు. అయితే అంత డబ్బు ఒక్కసారిగా సేవ్ చేయడం కష్టం కదా.. అందుకే SBI ఒక చక్కటి స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇందులో మీరు కొంచెం కొంచెం సేవ్ చేస్తే చాలా తక్కువ కాలంలోనే రూ.లక్ష మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI ‘హర్ ఘర్ లక్ష్‌పతి’ అనే గేమ్ ఛేంజర్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రీ-కాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ద్వారా రూ.1,00,000 అంతకంటే ఎక్కువ సొమ్మును తక్కువ పెట్టుబడితో పొందవచ్చు. ఈ పథకం గతంలో కంటే సింపుల్ గా మీరు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయ పడుతుంది.
జనరల్ గా RD(రికరింగ్ డిపాజిట్) అకౌంట్ అంటే ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేసే స్కీమ్. మీరు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ప్రతి నెల మీరు కట్టగలిగే అమౌంట్, టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు RD స్టార్ట్ చేస్తే ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీని పొందవచ్చు.
‘హర్ ఘర్ లక్ష్‌పతి’ పథకం ప్రత్యేకత ఏంటంటే.. సేవింగ్స్ స్కీమ్స్ లో గతంలో ఉండే ఇబ్బందులు ఇందులో లేకుండా రూపొందించారు. ఈ స్కీమ్ ద్వారా పొదుపు ప్రక్రియను సులభతరం చేశారు. అందువల్ల కస్టమర్లు తమకు నచ్చిన నెలవారీ అమౌంట్, కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఈ పథకం పెద్దలకు మాత్రమే కాకుండా చిన్నారులకు కూడా అందుబాటులో ఉంది. చిన్న పిల్లలు కూడా తమ కెపాసిటీని బట్టి సేవింగ్స్ చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ లో చేరే కస్టమర్‌లు కనీసం 12 నెలల టెన్యూర్ ని ఎంచుకోవాలి. గరిష్టంగా 120 నెలల వరకు ఆర్డీ కట్టొచ్చు. సాధారణ రికరింగ్ డిపాజిట్ పథకం స్థిర డిపాజిట్ల వంటి వడ్డీ రేట్లను అందిస్తుండగా, SBI ఆకర్షణీయమైన రాబడిని అందించడానికి ‘హర్ ఘర్ లక్ష్‌పతి’ పథకాన్ని తీసుకొచ్చింది.
‘హర్ ఘర్ లక్ష్‌పతి’ స్కీమ్ లో ప్రస్తుతం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాల పరిమితి పెట్టుకుంటే కస్టమర్‌లు 6.80 % రేటును పొందవచ్చు. ఇది రెండు సంవత్సరాలకు పైగా 7%కి పెరుగుతుంది. దీర్ఘకాలిక కమిట్‌మెంట్‌ల కోసం వ్యవధిని బట్టి రేట్లు 6.75 % నుండి 6.5 % వరకు మారుతూ ఉంటాయి.
మీరు గాని ఈ స్కీమ్ లో చేరాలనుకుంటే సమీప SBI శాఖను సందర్శించండి. ‘హర్ ఘర్ లక్ష్‌పతి’ అకౌంట్ ను ఓపెన్ చేయండి. లేదా SBI బ్యాంక్ ఆన్‌లైన్ వెబ్ సైట్ లోనూ నమోదు చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా కూడా ఓపెన్ చేయొచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, స్పష్టంగా సంతకం చేయగల మైనర్ కూడా వ్యక్తిగతంగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
మూడు, నాలుగు సంవత్సరాలకు అందించే వడ్డీ రేటు సాధారణ ప్రజలకైతే 6.75%, సీనియర్ సిటిజన్లకైతే 7.25% ఉంటుంది.
ఒక సాధారణ వ్యక్తి 6.75 % వడ్డీ రేటుతో మూడు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.2,500 పెట్టుబడి పెడితే, చివరికి రూ. 1 లక్షను పొదుపు చేసుకోవచ్చు. అదే వడ్డీ రేటుతో నాలుగు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.1,810 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.1 లక్షను సంపాదించొచ్చు. 6.50% వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ.1,407ను ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టినా లక్ష రూపాయలు సంపాదించొచ్చు.
సీనియర్ సిటిజన్ అయితే 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.2,480 పెట్టుబడి పెడితే చివరికి 7.25% వడ్డీ రేటుతో రూ.1 లక్షను పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్ ప్రతి నెలా రూ.1,791ను 4 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే 7.25% వడ్డీ రేటుతో రూ.1 లక్షను పొందవచ్చు. ఒకవేళ ప్రతి నెలా రూ.1,389ను మూడు సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే చివరికి 7% వడ్డీ రేటుతో రూ.1 లక్షను పొందవచ్చు.