MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • మీరు సిమ్ కార్డు రీఛార్జ్ చేయడం లేదా? ఎన్ని రోజుల్లో డీ యాక్టివేట్ అవుతుందో తెలుసా?

మీరు సిమ్ కార్డు రీఛార్జ్ చేయడం లేదా? ఎన్ని రోజుల్లో డీ యాక్టివేట్ అవుతుందో తెలుసా?

మొబైల్ రీఛార్జ్ చేయకపోతే అందులో ఉండే మీ సిమ్ డీ యాక్టివేట్ అయిపోతుందని మీకు తెలుసు కదా.. తర్వాత కొన్ని రోజులకు మీ మొబైల్ నంబరు వేరే వాళ్లకి కేటాయిస్తారు. అయితే ఎన్ని రోజుల వరకు రీఛార్జ్ చేయకపోతే మీ సిమ్ పనిచేయదో మీకు తెలుసా? టెలికాం కంపెనీల నిబంధనలు ఏమిటో? డీయాక్టివేట్ అయిన సిమ్ ఎప్పటి వరకు పనిచేయదో ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 07 2024, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డ్యూయల్ సిమ్స్ ఉపయోగిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి రెండు ఫోన్ నంబర్లు ఉంటున్నాయి. కొంతమంది వివిధ అవసరాల కోసం మూడు, నాలుగు సిమ్‌లను కూడా ఉపయోగిస్తారు. అవి కూడా వేరే వేరే నెట్వర్క్ లకు చెందినవి అయి ఉంటాయి. ఎందుకంటే ఒక సిమ్ కి సిగ్నల్ లేకపోయినా మరో సిమ్ నంబరుకు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్ నెట్ సౌకర్యం కూడా మీ ప్రాంతంలో ఎక్కువ సిగ్నల్ వచ్చే సిమ్ కే యాక్టివేట్ అయి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు రెండేసి సిమ్ లు ఉపయోగిస్తుంటారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే సిగ్నల్స్ సరిగా లేవని, రీఛార్జ్ ధరలు పెంచారని కొందరు సిమ్ కార్డులు రీఛార్జ్ చేయడం మానేస్తుంటారు. రీఛార్జ్ చేయకుండా సిమ్ నిలిపివేస్తే ఆ నంబర్ ను టెలికాం సంస్థ తర్వాత వేరొకరికి కేటాయిస్తుంది. అందుకే మీ ఫోన్ చేస్తే వేరే ఎవరో మాట్లాడుతున్నారని అప్పుడప్పుడు మన సన్నిహితులు చెబుతుంటారు. సిమ్ కార్డు ఉపయోగాలు, ఎక్స్‌పైరీ డేట్ తదితర విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. 

35

సిమ్ కార్డు ను ఎలా ఉపయోగించాలన్న విషయం చాలా మందికి తెలియదు. రెగ్యులర్ గా కాల్ చేసే నంబరుకు మాత్రం రీఛార్జ్ చేస్తుంటారు. మిగతా నంబర్ల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇన్ కమింగ్ కాల్స్ వస్తున్నాయి కదా అని అవుట్ గోయింగ్ సేవలు అవసరం లేదని రీఛార్జ్ చేయడం మానేస్తుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సిమ్ కార్డుకు బేసిక్ ప్లాన్ రీచార్జ్ చేయకపోతే 30 రోజుల తర్వాత అవుట్‌గోయింగ్ కాల్స్, డేటా సేవలు నిలిపివేస్తారు. ఈ నిర్ణయం ఆయా టెలికాం కంపెనీలపై ఆధారపడి ఉంటుంది. ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్-ఐడియా తదితర టెలికాం  సంస్థలన్నీ సాధారణంగా నెల రోజుల తర్వాత అవుట్ గోయింగ్ సేవలు నిలిపివేస్తాయి.  90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు రీచార్జ్ చేయకపోతే పూర్తిగా డి-యాక్టివేట్ అవుతుంది.

45

అయితే సిమ్ కార్డు వాడకపోయినా ఆ నంబర్ మిస్ అవ్వకూడదని చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే ఆ నంబర్ కలిసొచ్చిందనో, ఫ్యాన్సీ నంబర్ కావడం వల్లనో, ఎక్కువ మందికి ఈ నంబర్ కాంటాక్ట్ లో ఉందనో  పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అలాంటి సిమ్ వివిధ కారణాల వల్ల డీ యాక్టివేట్ అయితే సేవను పునరుద్ధరించడానికి సాధారణంగా 6 నుండి 9 నెలల వరకు సమయం పడుతుంది. ఆ తర్వాత నంబర్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా అది మళ్లీ యాక్టివేట్ అవుతుంది.

55

డి-యాక్టివేట్ అయిన సిమ్ కార్డ్ మళ్ళీ యాక్టివేట్ చేయడానికి మీరు మీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్ ని సంప్రదించడం అవసరం. నెట్‌వర్క్ సంస్థకు వెళ్లి కొత్త KYC డాక్యుమెంట్లతో కూడిన వేరియఫికేషన్ చేయించాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సిమ్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి సుమారుగా  ఒక సంవత్సరం పడుతుంది. ఇంత ప్రయాస పడటం కంటే మీకు అవసరమైన ఫోన్ నంబరును ఎప్పటికప్పుడు బేసిక్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవడం ముఖ్యం. 

 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved