MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా బెటర్ మైలేజ్ ఇచ్చే కారు ఇదిగో

ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా బెటర్ మైలేజ్ ఇచ్చే కారు ఇదిగో

మీరు మంచి మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్నారా? ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారును హోండా కంపెనీ తీసుకొచ్చింది. ఇండియాలో జరిగిన వార్షిక డీలర్ల సమావేశంలో హోండా ఈ కారుని ప్రదర్శించింది. ఆ కారు ప్రత్యేకతలు, సౌకర్యాలు తదితర వివరాలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 29 2025, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి తీసుకురావడానికి చాలా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే రకరకాల మోడల్స్ ఇప్పటికే మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. అందుకే హోండా కూడా తన కొత్త HEV ZR-V ని ప్రవేశపెట్టింది.

ఇండియాలో జరిగిన వార్షిక డీలర్ల సమావేశంలో ఈ కారుని ప్రదర్శించారు. దీన్ని బట్టి కొత్త కారు త్వరలోనే మార్కెట్లోకి రాబోతుందని అర్థమవుతోంది. ఇప్పటికే ఉన్న సిటీ e:HEV తర్వాత ఇది హోండా నుండి వస్తున్న రెండవ హైబ్రిడ్ కారు ఇది.

25

Honda ZR-V e: HEV డిజైన్ హోండాలో ఇప్పటివరకు ఉన్న కార్ల కన్నా కాస్త భిన్నంగా ఉంది. కారు ముందు భాగంలో ఎలివేట్ కారులో ఉన్న గ్రిల్ లాంటిదే ఉంది. కానీ దీనిలో రేడియేటర్ గ్రిల్ వరకు వంపులు, గీతలు కలిగిన డిజైన్ ఉంది. కొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్, DRLలు కారుకి స్టైలిష్ లుక్ ఇస్తున్నాయి. కారు వెనుక భాగంలో డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి.

35

ఇంటీరియర్ డిజైన్

కారు ఇంటీరియర్ చాలా స్టైలిష్ గా ఉంది. 10.2 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ADAS లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హోండా ZR-V అంతర్జాతీయ మార్కెట్లో రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది 181 హెచ్ పి పవర్, 315 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT గేర్ బాక్స్ తో వస్తుంది.

45

హోండా eHEV సిస్టం

హోండా తన సిటీ E:Hev లో eHEV టెక్నాలజీని ఉపయోగించింది. ఇంజిన్, మోటార్ రెండింటి నుండి పవర్ ని ఉపయోగించుకునేలా హైబ్రిడ్ మోడ్ లో కారు నడుస్తుంది. ఈ మోడ్ లో ఇంజిన్ బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి జనరేటర్ లాగా పనిచేస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీలు EV డ్రైవ్ మోడ్ లో చక్రాలను తిప్పుతాయి.

అంతేకాకుండా 1.5 cc ఇంజిన్ కారుని నడిపే సాధారణ మోడ్ కూడా ఉంది. పూర్తిగా EV కి మారడానికి ఇష్టపడని వారికి ఇది మంచి ఆప్షన్. కానీ దాదాపు రూ.19.79 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ధర ఉండటం కొంచెం ఎక్కువ.

 

55

EV కన్నా మంచి మైలేజా?

హైబ్రిడ్ కారు పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండింటితోనూ నడుస్తుంది. కాబట్టి దీని రేంజ్ ఎక్కువ. EVలకు ఛార్జింగ్ అవసరం. సిటీ E:hev మైలేజ్ లీటరుకు 27 కి.మీ. వస్తుంది. కొత్త SUV కి మంచి డిమాండ్ ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓం భీం బుష్.! ఈ ఒక్క స్టాక్ ఉంటే.. కాలు మీద కాలేసుకుని బ్రతికేయొచ్చు.. ఉద్యోగంతో పనేలేదు..
Recommended image2
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో రూమ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వస్తే.! చట్టం ఏం చెబుతోంది.
Recommended image3
Post office: ఇలా చేస్తే మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం.. 5 ఏళ్ల‌లో రూ. 2.2 ల‌క్ష‌ల వ‌డ్డీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved