MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • గ్లోబల్ ఎక్స్‌పో లో హోండా ఆక్టివా సందడి: బడ్జెట్ ధరలో రెండు స్కూటర్లు

గ్లోబల్ ఎక్స్‌పో లో హోండా ఆక్టివా సందడి: బడ్జెట్ ధరలో రెండు స్కూటర్లు

ఎన్నాళ్లుగానో వినియోగదారులను ఊరిస్తున్న హోండా కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 వేదికగా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లైన ఆక్టివా e, QC1 లను ఆవిష్కరించింది. అవి కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరల్లో వీటిని మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. ఈ స్కూటర్ల ఫీచర్లు, ధరలు తదితర వివరాలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 19 2025, 11:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో అంగరంగ వైభవంగా సాగుతోంది. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఆటో ఎక్స్ పో కోసం ప్రపంచ దేశాలకు చెందిన అనేక కంపెనీలు చాలా ఆసక్తిగా ఎదురుచూశాయి. ఫైనల్ గా జనవరి 17న ప్రారంభమైన ఈ గ్లోబల్ ఎక్స్ పోలో అనేక కంపెనీలు తమ లేటెస్ట్ వెహికల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. 

అందులో భాగంగా హోండా కంపెనీ తన రెండు స్కూటర్ ప్రోడక్ట్స్ ను లాంఛ్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో లో హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఆక్టివా e, QC1 లను ప్రదర్శించడమే కాకుండా ధరలను కూడా వెల్లడించింది. హోండా ఆక్టివా e రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ బేస్ మోడల్ ధర రూ.1.17 లక్షలు. ఇందులో RoadSync Duo వేరియంట్ ధర రూ.1.52 లక్షలు ఉంది.

ఈ స్కూటర్లలో బ్యాటరీ ప్లేస్‌మెంట్ సరిగ్గా సరిపోయేలా ఫిట్ చేశారు. వీటిల్లో బ్యాటరీ పెద్దగా ప్లేస్ తీసుకోదు.

35

ఆక్టివా e, QC1 బుకింగ్‌లు రూ.1,000 టోకెన్ తో ప్రారంభమయ్యాయి. హోండా రూ.9,900కి కేర్ ప్లస్ ప్యాకేజీని కూడా అందిస్తోంది.

ఆక్టివా e ప్రొడక్షన్ కర్ణాటకలోని హోండా నర్సాపుర ప్లాంట్‌లో జరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 2025లో బెంగళూరులో డెలివరీలు ప్రారంభమవుతాయని చెప్పింది. తర్వాత ఏప్రిల్ 2025లో ఢిల్లీ, ముంబైలో డెలివరీలు జరుగుతాయి.

45

హోండా QC1ని విషయానికొస్తే దీని ధర రూ.90,000. ఇది కంపెనీ అత్యంత సరసమైన ధర కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 1.5 kWh బ్యాటరీని కలిగి ఉంది. 1.8kW BLDC మోటార్‌ ఉండటం వల్ల రన్నింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. QC1 స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 50 కి.మీ వరకు వెళ్లగలరు.  ఈ స్కూటర్ మాక్సిమం స్పీడ్ 80 kmph. 

55

QC1 హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 89.5 కిలోలు. 12/10 - అంగుళాల అల్లాయ్ వీల్స్ బండి స్మూత్ గా వెళ్లే లా చేస్తాయి. డ్రమ్ బ్రేక్‌లు బండి వేగాన్ని వెంటనే తగ్గించేందుకు సహకరిస్తాయి. దీని డిజైన్ ఆక్టివా eని పోలి ఉంటుంది. ఈ స్కూటర్ ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్‌లలో ఉన్న బ్రాంచ్ షోరూమ్ లలో  లభిస్తుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved