- Home
- Business
- Train live Status: మీరు ఎక్కబోయే రైలు ఎక్కడుందో లైవ్ స్టేటస్ చెక్ చేయడానికి 5 సులువైన మార్గాలు ఇవిగో
Train live Status: మీరు ఎక్కబోయే రైలు ఎక్కడుందో లైవ్ స్టేటస్ చెక్ చేయడానికి 5 సులువైన మార్గాలు ఇవిగో
మనదేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది రైలు (Train) ప్రయాణం చేస్తారు. మీరు ఎక్కబోయే రైలు ఎక్కడుందో తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. లైవ్ రన్నింగ్ స్టేటస్ (Train Live Status) చెక్ చేసుకోవడం ఎలాగో ఇక్కడ ఇచ్చాము. ఎలాగో తెలుసుకోండి.

SMS ద్వారా లైవ్ స్టేటస్
మీ దగ్గర సాధారణ ఫోన్ ఉన్నా చాలు SMS ద్వారా లైవ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ముందు మీరు సాధారణ ఫీచర్ ఫోన్లో మెసేజులు ఫోన్ చేయండి.139 నెంబర్ SPOT అనే మెసేజ్ పంపండి. మీకు రైలు లైవ్ స్టేటస్ SMS రూపంలో వస్తుంది.
IVRS సహాయంతో
IVRS పాత పద్ధతే. కానీ నమ్మకమైన పద్ధతి. దీనిద్వారా కాల్ చేసి రైలు స్టేటస్ వినొచ్చు. ఇందుకోసం మీరు మీ ఫోన్ నుంచి 139 డయల్ చేయండి. వాయిస్ ప్రాంప్ట్ విని, లైవ్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోండి. కీప్యాడ్ ద్వారా రైలు నంబర్ ఎంటర్ చేయండి. IVRS మీకు రైలు రియల్ టైమ్ స్టేటస్ చెబుతుంది.
NTES వెబ్‌సైట్ సహాయంతో
భారతీయ రైల్వే అధికారిక పోర్టల్ NTES వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ 'స్పాట్ యువర్ ట్రైన్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీరు ఎక్కబోయే రైలు పేరు లేదా నంబర్ ఎంటర్ చేసి, సరైన ఆప్షన్ ఎంచుకోండి. మీ ప్రయాణ తేదీని ఎంచుకోండి. ఇప్పుడు మీ రైలు లైవ్ స్టేటస్, రూట్ మ్యాప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
NTES మొబైల్ యాప్
ఆండ్రాయిడ్, iOS రెండింటికీ అధికారిక NTES యాప్ అందుబాటులో ఉంది. యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి NTES యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ తెరిచి 'స్పాట్ యువర్ ట్రైన్' ఎంచుకోండి. రైలు పేరు లేదా నంబర్ ఎంటర్ చేసి 'షో ఇన్‌స్టాన్సెస్'పై ట్యాప్ చేయండి. స్క్రీన్‌పై రైలు కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి రూట్ మ్యాప్, స్టేటస్ చూడొచ్చు.
RailOne యాప్ ద్వారా
రైల్‌వన్ యాప్‌ను CRIS ప్రారంభించింది. ఇది రైల్వే సేవలను ఒకేచోట అందిస్తుంది. రైలును ట్రాక్ చేయడానికి, RailOne యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ లేదా లాగిన్ అవ్వండి. హోమ్ స్క్రీన్‌పై 'ట్రాక్ యువర్ ట్రైన్' ఎంచుకోండి. రైలు పేరు/నంబర్, ప్రయాణ తేదీ/స్టేషన్ ఎంటర్ చేయండి. 'కరెంట్ మూవ్‌మెంట్' ఎంచుకుని లైవ్ రూట్ మ్యాప్ చూడండి.