హెచ్‌డిజిసి బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. నేడు, రేపు ఈ సౌకర్యాలు అందుబాటులో ఉండవు..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఈ రోజు, రేపు కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలలో అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. షెడ్యూల్ మెయింటైనాన్స్ కారణంగా ఈ రోజు రాత్రి 9 గంటల నుండి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు లోన్ సంబంధిత సదుపాయాలు అందుబాటులో ఉండవని బ్యాంక్ ఇ-మెయిల్ ద్వారా కస్టమర్లకు తెలియజేసింది.

21 ఆగష్టు 2021 రాత్రి 9 గంటల నుండి 22 ఆగస్టు 2021 మధ్యాహ్నం 3 గంటల వరకు నెట్‌బ్యాంకింగ్‌లో ఖాతాదారులు లోన్ సంబంధిత సదుపాయాలు పొందలేరని బ్యాంక్ సమాచారం ఇచ్చింది అంటే 18 గంటల పాటు బ్యాంక్ సర్వీసులకు బ్రేక్ పడనుంది. ఈ అంతరాయం డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి అని బ్యాంక్ చెప్పింది. మా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇందుకు కస్టమర్లు మాతో సహకరిస్తారని ఆశిస్తునట్లు బ్యాంక్ తెలిపింది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాదారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాదారులు చాలా సార్లు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అలాగే కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి నిరంతరం కృషి చేస్తుంటుంది.
ఈ నెల ప్రారంభంలో రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక పెద్ద ఉపశమనం కల్పించింది. ఎనిమిది నెలల నిషేధం తర్వాత కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి రిజర్వు బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సికి అనుమతించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో పదేపదే టెక్నికల్ సమస్యల కారణంగా ఆర్‌బిఐ ఈ నిషేధం విధించింది. నిషేధం విధించినప్పటి నుండి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆర్‌బిఐ సూచనల ప్రకారం సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేసింది.