H-1B వీసాపై అమెరికాలోని భారతీయులకు గుడ్ న్యూస్!
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. వారి H-1B వీసా రిన్యూవల్ కు సంబంధించి అప్ డేట్ ఇది. వీసా రిన్యూవల్ కోసం అయ్యే ఖర్చును తగ్గించే విధానం త్వరలో అమలు కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
అమెరికాలో ఉంటున్న భారతీయుల ‘H-1B’ వీసా పునరుద్ధరణకు అమెరికా ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఇచ్చే విదేశీ అతిథి కార్మిక వీసా ‘H-1B’ వీసా. ఇప్పుడు H-1B వీసాలు కలిగిన భారతీయులు ఇండియా రాకుండానే వీసాలు పునరుద్ధరించుకోవచ్చు. ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందుగా నిర్వహించిన పైలెట్ ప్రాజెక్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. అందువల్ల అమెరికాలోని ఇండియన్స్ కి లబ్ధి చూకూరేలా త్వరలో నూతన విధానం ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం త్వరలోనే వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
దీని ద్వారా H-1B వీసా ఉన్నవారు అమెరికా దేశం వదిలి వెళ్లకుండానే తమ పత్రాలను రిన్యూవల్ చేయించుకోవచ్చు. H-1B వీసా ఉన్నవారికి అమెరికాలోనే పునరుద్ధరించే కార్యక్రమం ఈ ఏడాది అమలులోకి వస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల అమెరికాలోని భారతీయ కార్మికులు, అనేక రకాల నిపుణులు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు.
ఇప్పటి వరకు H-1B వీసా రిన్యూవల్ చేయించుకోవాలంటే అమెరికాలోని భారతీయులు ఇండియా రావాల్సి వచ్చేది. అవసరం లేకపోయినా వీసా పని మీద అమెరికా నుంచి ఇండియా వచ్చి వెళ్లాల్సి రావడంతో ట్రావెలింగ్ ఛార్జీలు పెరిగిపోయి సంపాదించిన దాంట్లో ప్రయాణాలకు బాగా ఖర్చుపెట్టాల్సి వచ్చేది.
H-1B వీసా పునరుద్ధరణకు ఇకపై స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఇది అమెరికా ఇండియన్స్ కి ఒకరకంగా శుభవార్తే. ప్రతి సారి H-1B వీసాలను రీన్యూవల్ చేయించడానికి ఇండియాలకు రావాల్సి ఉండటంతో డబ్బు, టైం రెండూ వేస్ట్ అవుతున్నాయని చాలా మంది భారతీయ కార్మికులు భావించేవారు. ఎందుకుంటే సంపాదించిన డబ్బులో ట్రావెలింగ్ కే ఎక్కువ ఖర్చు పెడితే ఇక ఇంటికి పంపడానికి ఎక్కువ మిగలడం లేన్నదని వారి వాదన.
H-1B వీసాల రీన్యూవల్ కి సంబంధించి అమెరికాలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ వేల మంది దరఖాస్తుదారుల వీసాలను పునరుద్ధరించింది. అమెరికాలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మూడు వారాల ముందు ఈ అనౌన్స్ మెంట్ రావడంతో అమెరికాలోని ఇండియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య విభేదాలకు దారితీసిన ‘H-1B’ వీసా విషయం.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టకుండానే అమలు చేయించడంపై అంతటా హర్షం వ్యక్తం అవుతోంది.
అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఇచ్చే విదేశీ అతిథి కార్మిక వీసా ‘H-1B’ ప్రధాన లబ్ధిదారులు భారతీయులే. 2022లో 3,20,000 H-1B వీసాలను జారీ చేయగా అందులో 77% భారతీయ పౌరులు ఉన్నారు. 2023లో జారీ అయిన 3,86,000 వీసాలలో 72.3 % ఇండియన్స్ ఉన్నారు. దీన్ని ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడం అమెరికాలోని ఇండియన్స్ కి ఎంత సంతోషాన్నిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన H-1B వీసాకు మద్దతు ఇవ్వడం వల్లనే భారతీయులకు లబ్ధి జరిగిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి అమెరికాలో కార్మికుల ఉద్యోగాలను ఇండియన్స్ సంపాదించేస్తున్నారన్న విమర్శ ఉంది. దీన్ని సమర్థించిన ట్రంప్ కూడా ఇప్పుడు H-1B వీసా రీన్యూవల్ అమెరికాలోనే చేసుకొనేలా సహకరించడం అమెరికా, భారత్ మధ్య సత్సంబంధాలు మెరుగు అవుతాయని నిరూపిస్తోంది.