మహిళలకు గుడ్ న్యూస్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో Union Nari Shakti కింద రూ. 10 లక్షల లోన్ ఈజీగా పొందే అవకాశం
మహిళలు మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా, అందుకోసం బ్యాంకు నుంచి రుణం పొందాలని ప్లాన్ చేసుకుంటున్నారా, అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రారంభించిన యూనియన్ నారీ శక్తి STP పథకం ద్వారా రెండు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఈ రుణాలను కేవలం సూక్ష్మ , చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు చాలా ఉపయోగపడుతుంది.
మహిళలను వ్యాపారస్తులుగా ప్రోత్సహించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యూనియన్ నారీశక్తి పథకాన్ని ప్రారంభించింది తద్వారా వారి వ్యాపారానికి వర్కింగ్ క్యాపిటల్ గా ఈ రుణం వారికి ఉపయోగపడుతుంది. ఈ ఈ పథకంలో గరిష్టంగా 10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.
ఈ రుణాన్ని సులభ వాయిదా పద్ధతిలో ప్రతినెలా చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ రుణం పై 9.3% వడ్డీ వసూలు చేస్తున్నారు EBLR పద్ధతిలో రుణాన్ని నిర్ణయిస్తున్నారు. అంటే రెపోరేట్లకు అనుగుణంగా ఆర్బిఐ గైడ్లైన్స్ కు తగ్గట్టుగా రుణ రేట్లు మారుతూ ఉంటాయి. . ఈ రుణానికి సంబంధించిన ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ చార్జీలు వంటివి చెల్లించనవసరం లేదు డిజిటల్ కన్వీనియన్స్ కింద కేవలం 1000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
ఇక గ్యారెంటీర్ విషయానికి వచ్చినట్లయితే థర్డ్ పార్టీ గ్యారంటీతో సంబంధం లేదు. . మీ సంస్థ యొక్క పార్ట్నర్స్ లేదా ప్రమోటర్లు గ్యారంటీ ఉంటే సరిపోతుంది. . ముఖ్యంగా మహిళలకు మాత్రమే ఈ రుణాలు నిర్దేశించినట్లు గమనించాల్సి ఉంటుంది.
ఇక రీపేమెంట్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఐదు లక్షల రూపాయల కన్నా తక్కువ రుణం తీసుకున్నట్లయితే 60 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది మీరు ప్రతి నెల చెల్లించే ఈఎంఐలో వడ్డీతో పాటు అసలు కలిపి ఉంటుంది. ఇక గ్యారెంటీ కింద మీ వ్యాపారంలోని ఆస్తులు తనకా పెట్టాల్సి ఉంటుంది.
అయితే యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారీ యూనియన్ నారీ శక్తి STP ఫథకం కింద మీరు వ్యాపారం ప్రారంభించినట్లయితే మీరు సులభ వాయిదాలలో ప్రతినెల డబ్బులు చెల్లించవచ్చు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది.
వడ్డీరేట్లతో బయట ప్రైవేటు వడ్డీరేట్ల తో పోల్చి చూసినట్లయితే ఈ పథకం చాలా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను అందిస్తోందని సంగతి గమనించాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు సులభ వాయిదాలలోనే రుణాలను చెల్లించవచ్చు. అతి తక్కువ డాక్యుమెంటేషన్ తోనే మీరు ఈ రుణాన్ని పొందే అవకాశం ఉంది.
ఈ రుణానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు సంబంధిత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కి వెళ్లి తెలుసుకోవడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది అంతేకాదు కింద పేర్కొన్నటువంటి వెబ్ లింకును క్లిక్ చేయడం ద్వారా మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి : https://msme.unionbankofindia.co.in/#/nari-shakti-main