- Home
- Business
- Gold Rate: అతి త్వరలోనే బంగారం ధర రూ. 75000 అవడం ఖాయం...కారణాలు ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Gold Rate: అతి త్వరలోనే బంగారం ధర రూ. 75000 అవడం ఖాయం...కారణాలు ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
బంగారం ధర అక్షయ తృతీయ సమీపిస్తున్న కొద్ది భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం పసిడి ధర 62000 దాటిపోయింది. దీంతో అతి త్వరలోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 75000 తాకే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మార్చి 1 నుంచి ఒక ఔన్స్ బంగారం అంటే 31 గ్రాములు ధర అమెరికాలో 2000 డాలర్లు దాటేసింది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. త్వరలోనే దేశీయంగా కూడా బంగారం ధర రూ. 75000 దాటే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం బంగారం 18.02 శాతం, వెండి శాతం. 9.42 శాతం పెరిగాయి. అధిక ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు వంటి ప్రభావాల వల్ల స్టాక్ మార్కెట్ లు ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. అదే సమయంలో బంగారం, వెండి సురక్షితమైన పెట్టుబడులుగా బావించడంతో,. బంగారం మరోసారి రూ.60,000 మార్కును దాటింది. అదే సమయంలో, వెండి కూడా రూ.70,000 మార్కును దాటింది. అయితే బంగారం ర్యాలీ మరికొద్ది నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
IIFL వైస్ చైర్మన్ అనూజ్ గుప్తా ప్రకారం, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో అనిశ్చితి ఉంది. ఈ అనిశ్చితి కొన్ని నెలల పాటు కొనసాగుతుందని. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.75,000కు చేరవచ్చని అంచనా వేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇటీవలి ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభం, అధిక వడ్డీ రేట్లు, విదేశీ సంస్థాగత నిధుల ప్రవాహం , ఇతర అంశాలు స్టాక్ మార్కెట్ పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపాయి. గతేడాది ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్‌లో హెచ్చు తగ్గులు కనిపించాయి. అయితే బంగారం ధరలను ఇవి ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా పసిడి ధరలు అంతర్జాతీయంగా ఔన్సు బంగారం అంటే 31 గ్రాములు 2500 డాలర్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే పసిడి ధరలు రూ. 75 వేలు కావడం పెద్ద కష్టం ఏమీ కాదు.
ఈ వారంలో అమెరికన్ ఫెడ్ రిజర్వ్ సమావేశం జరగనుండడంతో వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ ట్రెండ్, బంగారంపై దిగుమతి సుంకం మరియు డాలర్‌తో రూపాయి విలువను బట్టి, సంబంధిత రోజు బంగారం, వెండి రేటు నిర్ణయించబడుతుంది. త్వరలోనే అమెరికన్ ఫెడ్ రిజర్వ్ సమావేశం జరగనుండడంతో వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ ట్రెండ్, బంగారంపై దిగుమతి సుంకం మరియు డాలర్‌తో రూపాయి విలువను బట్టి, సంబంధిత రోజు బంగారం మరియు వెండి రేటు నిర్ణయించబడుతుంది.