MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate Fall: పాత ధరలకు దిగొస్తున్న పసిడి.. బంగారం రేట్లు మారడానికి కీలక కారణాలు ఇవే

Gold Rate Fall: పాత ధరలకు దిగొస్తున్న పసిడి.. బంగారం రేట్లు మారడానికి కీలక కారణాలు ఇవే

Gold Rate Fall: బంగారం కొనాలనుకుంటే మీకు గుడ్ న్యూస్. ఒక్కరోజులోనే ఈ భారీ తగ్గుదల నమోదైంది. అసలు ఈ భారీ తగ్గుదలకు కారణమేంటి? ఇంకా ధరలు తగ్గుతాయా? లేక ఇదే సరైన సమయమా? 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 07 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పసిడి ప్రియులకు భారీ ఊరట
Image Credit : Getty

పసిడి ప్రియులకు భారీ ఊరట

బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత కొన్ని రోజులుగా వరుసగా హెచ్చుతగ్గులు నమోదు చేసిన గోల్డ్ ధరలు.. ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కనిపిస్తున్న మార్పులు, డాలర్ ఇండెక్స్ బలపడటం, పెట్టుబడిదారుల ధోరణి ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు కిందికి వచ్చాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.1,45,260 వద్ద కొనసాగుతున్న బంగారం
Image Credit : Google

రూ.1,45,260 వద్ద కొనసాగుతున్న బంగారం

బులియన్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,360 తగ్గి రూ.1,45,260గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.1,250 తగ్గి రూ.1,33,150గా ఉంది. వెండి ధరల విషయానికి వస్తే.. ఈరోజు ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 

35
అయితే బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గాయి?
Image Credit : Asianet News

అయితే బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గాయి?

దీనికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు గోల్డ్ కంటే ఇతర ఆస్తుల వైపు మొగ్గు చూపడం, ప్రపంచ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడటం వంటి అంశాలు గోల్డ్ ధరలపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధరల్లో తగ్గుదల కనిపించగా.. దాని ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా పడింది. 

45
బంగారం ధరలు మారడానికి కీలక కారణాలు ఇవే
Image Credit : our own

బంగారం ధరలు మారడానికి కీలక కారణాలు ఇవే

రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల దిశ పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్ కదలికలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేసే స్థాయి, అలాగే వివిధ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు ధరలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా ఉన్నాయి.

55
బంగారం మళ్లీ పుంజుకునే అవకాశం
Image Credit : Asianet News

బంగారం మళ్లీ పుంజుకునే అవకాశం

ఒకవేళ అమెరికా డాలర్ మరింత బలపడితే.. లేదా వడ్డీ రేట్లు ఎక్కువకాలం అధిక స్థాయిలో కొనసాగితే.. బంగారం ధరలపై మరింత ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినా.. లేదా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినా.. బంగారం మళ్లీ బలంగా పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఒకరోజు ధరలను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకుండా.. మార్కెట్ ట్రెండ్, అంతర్జాతీయ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను కూడా పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ 7 సెట్టింగ్స్ ఆఫ్ చేయకపోతే అకౌంట్ ఖాళీ
Recommended image2
Gold Price Fall: దసరా వేళ బంగారం భారీ పతనం...పసిడి ప్రియులకు పండగే పండగ
Recommended image3
Gold Price Hike: బంగారం ధరలకు రెక్కలు.. 10 గ్రాములపై ఏకంగా రూ.1,040 పెరుగుదల
Related Stories
Recommended image1
Today Gold Rate: బంగారం ధర తగ్గడానికి అసలు కారణం ఇదే.. ఇకపై ఏం జరగబోతోంది?
Recommended image2
Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved