MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate: బంగారం ధర తగ్గడానికి అసలు కారణం ఇదే.. ఇకపై ఏం జరగబోతోంది?

Today Gold Rate: బంగారం ధర తగ్గడానికి అసలు కారణం ఇదే.. ఇకపై ఏం జరగబోతోంది?

Today Gold Rate: వారం రోజులుగా వరుసగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన బంగారం... ఇప్పుడు ఒక్కసారిగా శాంతించింది. ఈరోజు హైదరాబాద్, విజయవాడలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి?. 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 06 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శాంతించిన బంగారం ధరలు
Image Credit : Getty

శాంతించిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. స్వల్ప తగ్గుదల నమోదు కావడంతో బంగారం కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్న వారికి ఇది కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న మార్పులు, డాలర్ కదలికలు ఈ మార్పులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం
Image Credit : our own

మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయనే సంకేతాలు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. అదే సమయంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనను తగ్గించాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ కొంత తగ్గుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ధరలు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపించింది. 

Related Articles

Related image1
Original Bharat mata: మొదటిసారి గీసిన భారతమాత పెయింటింగ్ ఎలా ఉండేదో తెలుసా?
Related image2
Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు
35
రూ.1,46,620 కు చేరిన బంగారం
Image Credit : Asianet News

రూ.1,46,620 కు చేరిన బంగారం

ఇప్పుడు హైదరాబాద్‌లోని తాజా బంగారం ధరలను పరిశీలిస్తే... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,46,620 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.1,34,400కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మాత్రం రూ.800 తగ్గి రూ.1,09,970 వద్ద నమోదైంది. విజయవాడ మార్కెట్‌లో కూడా ఇదే తరహా ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే... అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో వెండి ధరల్లో కూడా స్వల్ప బలహీనత కనిపిస్తోంది.కిలో వెండిపై రూ.10వేలు తగ్గి రూ.2.50లక్షలకు చేరుకుంది.

45
అసలు ఈరోజు బంగారం ఎందుకు తగ్గింది?
Image Credit : Pixabay

అసలు ఈరోజు బంగారం ఎందుకు తగ్గింది?

దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇటీవల ధరలు గణనీయంగా పెరగడంతో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం ప్రారంభించారు. దీనినే మార్కెట్ భాషలో "ప్రాఫిట్ బుకింగ్" అంటారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాల విషయంలో మార్కెట్‌లో ఉన్న అంచనాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

55
బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా ?
Image Credit : our own

బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా ?

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. కాబట్టి అత్యవసర అవసరం ఉంటే దశలవారీగా కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.ఈరోజు బంగారం ధరల్లో భారీ పతనం ఏమీ నమోదు కాలేదు. కానీ వరుస పెరుగుదల తర్వాత స్వల్ప తగ్గుదల రావడం మాత్రం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Tata EV Discounts: టాటా ఈవీ కొనాలనుకునే వారికి పండగే.. ఏకంగా రూ. 3.35 లక్షల వరకు తగ్గింపు !
Recommended image2
Jainam Jain: ఇతను వ్యాపార రంగంలో వైభవ్ సూర్యవంశీ...14 ఏళ్లకే అద్భుతాలు
Recommended image3
పాత బట్టలకు కొత్త‌ పాత్రలు ఇచ్చేవారు డబ్బులు ఎలా సంపాదిస్తారో తెలుసా.? దీని వెన‌కాల ఏం అస‌లేం జ‌రుగుతుందంటే.
Related Stories
Recommended image1
Original Bharat mata: మొదటిసారి గీసిన భారతమాత పెయింటింగ్ ఎలా ఉండేదో తెలుసా?
Recommended image2
Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved