- Home
- Business
- Gold Rate: బంగారం తులం ధర 3 ఏళ్లల్లో రూ.1,31,140కి చేరవచ్చని అంచనా...షాకింగ్ న్యూస్ చెప్పిన స్పెయిన్ సంస్థ..
Gold Rate: బంగారం తులం ధర 3 ఏళ్లల్లో రూ.1,31,140కి చేరవచ్చని అంచనా...షాకింగ్ న్యూస్ చెప్పిన స్పెయిన్ సంస్థ..
దీపావళి నాటికి బంగారం రూ. 75 వేలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే స్పెయిన్‌కు చెందిన క్వాడ్రిగ్లియా ఇగ్నియో ఫండ్‌ను నిర్వహిస్తున్న డిగో పార్రిల్లా బంగారం అంచనాలు బులియన్ మార్కెట్లో సంచలనంగా మారింది.

గత కొంతకాలంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో కదులుతున్నాయి. 10 గ్రాముల ధర 60,000 దాటింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మళ్లీ బంగారం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దేశీయ మార్కెట్‌లో దీని పురోగతి నెమ్మదిగా ఉండనుంది. దీపావళి నాటికి బంగారం రూ. 75 వేలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే స్పెయిన్‌కు చెందిన క్వాడ్రిగ్లియా ఇగ్నియో ఫండ్‌ను నిర్వహిస్తున్న డిగో పార్రిల్లా బంగారం అంచనాలు వేసి సంచలనం సృష్టించాడు.
రానున్న 3 ఏళ్లలో బంగారం ధర ఔన్సు(31 గ్రాములు)కు 3,000-5,000 డాలర్లకు పెరగవచ్చని డిగో అభిప్రాయపడ్డారు. అంటే, రాబోయే నెలల్లో, భారతదేశంలో దీని ధర 10 గ్రాములకు రూ.78,690 నుండి రూ.1,31,140కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వార్త బంగారంపై పెట్టుబడి పెట్టేవారికి మంచిదే. కానీ సామాన్యులకు బంగారం కొనడం షాక్ కు గురి చేస్తోంది.
గత కొన్ని వారాలుగా బంగారం దాదాపు రూ.62,000 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి మధ్య బంగారం 2020లో తొలిసారి ఔన్స్‌కి 2,075.47 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే గత కొంత కాలంగా ఔన్సు ధర 1800 డాలర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం బంగారం ధర 2000 డాలర్లు దాటింది. దీనికి కారణం లేకపోలేదు. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభం కూడా ఒక కారణం అని చెప్పాలి.
ఫెడరల్ రిజర్వ్ యుఎస్‌లో విధానాన్ని కఠినతరం చేయాలని సూచించిన తర్వాత జూన్ 2023లో బంగారం ధరలు తగ్గుతాయని ఫండ్ మేనేజర్ డిగో పర్రిల్లా తెలిపారు. ప్రజలు అనుకుంటున్నట్లుగా సెంట్రల్ బ్యాంకులకు పరిస్థితిపై నియంత్రణ లేదని డిగో అభిప్రాయపడ్డారు. "రాబోయే 3 సంవత్సరాలలో బంగారం ధరలు ఔన్సుకు 5,000 డాలర్ల చేరుకుంటాయనే నా నమ్మకానికి కట్టుబడి ఉన్నాను." అని పేర్కొంటున్నారు.
క్వాడ్రిగా ఇగ్నియో ఫండ్ ఫండ్ మేనేజర్ డియెగో కూడా తన అంచనాకు బలమైన కారణాలను అందించాడు. బంగారం ధరలు కొత్త శిఖరాలకు చేరుకోవచ్చని డిగో అభిప్రాయపడింది. ఎందుకంటే, చాలా దేశాల్లో ఇచ్చిన రిలీఫ్ ప్యాకేజీల వల్ల సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పెట్టుబడిదారులకు తెలియదు. 2016లో బంగారం అత్యధిక స్థాయికి చేరుకుంటుందని డిగో అంచనా వేసింది. అలాగే జరిగింది. 2020 సంవత్సరంలో, కరోనా వైరస్ సమయంలో బంగారం రికార్డు ధర రూ. 56,200కి చేరుకుంది.