- Home
- Business
- Gold Rate: మంత్లీ చిట్ స్కీంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా..? ఇందులో ఏమైనా రిస్క్ ఉందా...
Gold Rate: మంత్లీ చిట్ స్కీంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా..? ఇందులో ఏమైనా రిస్క్ ఉందా...
బంగారం నగల షాప్ లో మనకి మంత్లీ చిట్ ప్రాతిపదికన బంగారు నగలు కొనుగోలు చేయమని ఆఫర్ చెబుతూ ఉంటారు అంతేకాదు మీరు ఒక మీరు 11 నెలలు డబ్బు చెల్లిస్తే ఒక నెల తామే చెల్లిస్తామని ఆకర్షణ ఏమైనా ఆఫర్లు కూడా పెడుతూ ఉంటారు. నిజానికి ఇలా మంత్లీ చిట్ ప్రాతిపదికన బంగారు నగలను కొనుగోలు చేయడం లాభదాయకమైన ఇందులో ఏమైనా మోసం ఉందా తెలుసుకుందాం.

బంగారం ధర రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. సామాన్యులకు అందుకోలేని స్థాయిలో బంగారం ధర ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయిని దాటింది. ఈ నేపథ్యంలో ఒక గ్రాము బంగారం కొనాలి అన్నా కూడా సుమారు 6000 రూపాయలు ఖర్చు చేయాల్సి కోస్తోంది. దీంతో ప్రస్తుతం పసిడి ప్రియులు ఒక చిన్న నగ కొనుగోలు చేయాలన్న కూడా ఆచితూచి అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 గ్రాముల విలువైన ఒక చిన్న బంగారు గొలుసు కొనుగోలు చేయాలన్నా కూడా సుమారు ఒక లక్ష 20 వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నగల దుకాణాలు ఆఫర్ చేస్తున్నాం మంత్లీ చిట్ సౌకర్యం ద్వారా బంగారం కొనుగోలు చేస్తే లాభమా లేదా నష్టమా అనే సంగతి తెలుసుకోండి.
సాధారణంగా నగల దుకాణాల వారు ప్రతి నెల చిట్ రూపంలో ఒక సంవత్సరం పాటు డబ్బు వసూలు చేసి మీకు కావాల్సిన నగలు కొనుగోలు చేసుకోమని ఆఫర్ ఇస్తూ ఉంటారు. చాలామంది మధ్యతరగతి ప్రజలు ఈ ఆఫర్లో భాగస్వామ్యం అవుతూ ఉంటారు. ఎందుకంటే పెరుగుతున్న ధరల మ ఒక్క ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం కష్టం దీంతో కొద్ది కొద్దిగా మంత్లీ చిట్ రూపంలో డబ్బు పోగుచేసుకుని నగలు కొనుగోలు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కానీ ఇలా కొనుగోలు చేయడం మంచిదేనా మీ డబ్బుకు తగ్గ విలువ తగ్గుతుందా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటాయి.
నిజానికి మంత్లీ పద్ధతి ద్వారా నగల షాపుల వాళ్ళు డబ్బు కలెక్ట్ చేయడం అనేది చట్టరీత్యా అనుమతి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇలా డబ్బు వసూలు చేసి వారు దానిపై కనీసం మీకు వడ్డీ కూడా ఇవ్వరు. పైగా చివరి నెలలో మీరు పొదుపు చేసిన డబ్బుతో ఆరోజు బంగారం రేటుకే మీరు నగలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తద్వారా మీకు పెద్దగా లాభం లేదనే చెప్పాలి. దాని బదులు రికరింగ్ డిపాజిట్లు మీ సొమ్మును ఆదా చేసుకొని బ్యాంకు నుంచి వడ్డీని పొంది ఆ డబ్బుతో నగలను కొనుగోలు చేసుకుంటే మీకు అసలు తో పాటు వడ్డీ కూడా లభిస్తుంది.
అలాగే బంగారు నగల దుకాణాలపై మనం గుడ్డిగా నమ్మకంతో ప్రతి నెల డబ్బులు చెల్లించలేము. పైగా ఇలా వారు డబ్బు నగదు సేకరించడానికి చట్టరీత్యా అనుమతి లేదు కనుక మీ డబ్బు రిస్క్ లో ఉన్నట్లే. కేవలం కస్టమర్, షాపు యజమాని నమ్మకం మీదనే ఈ మొత్తం తంతులు నడుస్తూ ఉంటుంది. అందుకే మీరు బంగారు నగల షాపింగ్ కు వెళ్ళినప్పుడు ఈ చిట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మీరు పెద్ద ఎత్తున డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది.