- Home
- Business
- Gold Rate: హైదరాబాద్ లో బంగారం అతి తక్కువ ధరకే ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోండి..నాణ్యమైన బంగారం మీ సొంతం
Gold Rate: హైదరాబాద్ లో బంగారం అతి తక్కువ ధరకే ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోండి..నాణ్యమైన బంగారం మీ సొంతం
హైదరాబాద్ నగరంలో బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే అతి తక్కువ ధరకే బంగారం ఎక్కడ లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . అలాగే ఏ ఏ ప్రాంతాల్లో బంగారం నాణ్యమైనది తక్కువ ధరలో లభిస్తుందో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఎక్కడ కొనాలో తెలియక సతమతం అవుతున్నారా. అది తక్కువ ధరకే బంగారం హైదరాబాద్ నగరంలో ఎక్కడ కొనుగోలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం ధర ప్రస్తుతం ఏకంగా రూ.60,000 దాటిపోయింది. ఒక చిన్న చైన్ కొనుక్కోవాలన్నా కూడా లక్ష రూపాయల పైన ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్క గ్రాము బంగారం తేడా వచ్చినా మీరు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో క్వాలిటీ విషయంలోనూ రేటు విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో అతి తక్కువ ధరకే మంచి నాణ్యమైన బంగారం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఏ ప్రాంతంలో లభిస్తుందో తెలుసుకుందాం.
దేశంలోనే బంగారం అత్యధికంగా కొనుగోలు చేసే నగరాల్లో హైదరాబాదు కూడా ఒకటి. హైదరాబాద్ నగరంలో తయారు చేసే నగలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. నైజాం కాలం నుంచి కూడా హైదరాబాదు స్వర్ణకారులకు మంచి పేరుంది. ఒకప్పుడు హైదరాబాద్ స్వర్ణకారులను ఢిల్లీ పిలిపించుకొని మరి నగలు తయారు చేయించుకునేవారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో సుమారు 150 సంవత్సరాలుగా నమ్మకం గా వ్యాపారం చేస్తున్న అనేక నగల దుకాణాలు ఉన్నాయి. నాణ్యతకు మన్నికకు డిజైన్లకు పెట్టింది పేరు.
బంగారు నగలను కొనుగోలు చేసే సమయంలో ముఖ్యంగా చూడాల్సింది. నాణ్యత నగల కొనుగోలు సమయంలో మనం 22 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేస్తామని గుర్తించాలి. 24 క్యారెట్ల బంగారంతో నగలను తయారు చేయరు. అంటే 22 క్యారెట్ల బంగారం ధర పూర్తి మేలిమి బంగారం కన్నా కూడా తక్కువగా ఉంటుంది. అయితే 18 క్యారెట్ల బంగారంతో కూడా నగలు తయారు చేస్తారు. ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నప్పటికీ ధర కొంచెం తక్కువగా ఉంటుంది. కొన్ని నగల దుకాణాల వారు 18 క్యారెట్ల బంగారంతో నగలు తయారు చేసి 22 క్యారెట్ల బంగారంతో తయారు చేశామని మనల్ని నమ్మిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం మోసపోతూ ఉంటాము.
అంతేకాదు బంగారు నగలను కొనుగోలు చేసినప్పుడు తరుగు మజూరీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతర షాపులను బేరీజు వేసుకోవాలి. నిజానికి తరుగు అనేది చట్టబద్ధమైనది కాదు. కానీ బంగారు దుకాణాల వారు తరుగు పేరిట చార్జీ వసూలు చేస్తూ ఉంటారు అని గమనించాలి.
హైదరాబాదులో ఎక్కడ బంగారు నగలు తక్కువ ధరకు లభిస్తాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా. హైదరాబాదులోని అబిడ్స్ ప్రాంతం బంగారు నగలకు పెట్టింది పేరు ఇక్కడ నైజాం కాలం నుంచి కూడా ప్రాంతం బంగారు నగలు కొనుగోలు చేయడానికి ప్రసిద్ధి చెందింది. అలాగే బషీర్బాకు ప్రాంతం కూడా బంగారు నగలకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇక్కడ కూడా నాణ్యమైన బంగారం లభిస్తుంది. అలాగే సికింద్రాబాద్లోని జనరల్ బజార్ సమీపంలో కూడా బంగారు దుకాణాల్లో మీకు మంచి నాణ్యమైన బంగారం లభిస్తుందనే పేరు ఉంది. అయితే బంగారం నగలకు దుకాణానికి వెళ్లే ముందు మీరు నాణ్యత విషయంలో అని నిబంధనలను తెలుసుకోండి బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న నగలను కొనుగోలు చేయండి.