- Home
- Business
- Gold Rate: కేవలం ఒక్క రూపాయికే బంగారం కొనుగోలు చేసే చాన్స్...ఎక్కడ, ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి..
Gold Rate: కేవలం ఒక్క రూపాయికే బంగారం కొనుగోలు చేసే చాన్స్...ఎక్కడ, ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి..
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీ చేతిలో డబ్బులు లేవా కేవలం ఒక్క రూపాయి ఉంటే చాలు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏంటి జోక్ చేస్తున్నాం అని అనుకుంటున్నారా.. కానీ ఇది అక్షర సత్యం మీరు ఒక రూపా అంతేయి బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షయ తృతీయ పండుగ ఈనెల 22న ఘనంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకొనున్నారు. ఈ రోజు ఒక గ్రాముకు కనీసం, ఒక గ్రాము బంగారం అయినా కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువవుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో మీరు కేవలం ఒక రూపాయికే బంగారం ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి. తద్వారా లక్ష్మీదేవి మీ నట్టింట్లో తాండవం చేయడం ఖాయం.
కేవలం ఒక రూపాయికే బంగారం కొనుగోలు చేయడం ఏంటి జోక్ చేస్తున్నారా. అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కేవలం ఒక్క రూపాయి కూడా బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ నేటి కాలంలో ఉంది. అయితే ఈ ఒక్క రూపాయి బంగారం మనం డిజిటల్ రూపంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది అది ఎలాగో పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.
మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అనేక పేమెంట్ యాప్స్ ఫోన్ పే, పేటీఎం వంటి మనీ వాలెట్ సంస్థలు కేవలం ఒక రూపాయికే డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఈ బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన బంగారం మీ డిజిటల్ వాలెట్లో నిక్షిప్తం అవుతుంది. ఆ రోజు మార్కెట్ రేటుకే మీరు బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఒక రూపాయికి ఎంత బంగారం వస్తుంది. అని మీరు భావించవచ్చు. కానీ కేవలం ఒక రూపాయి కూడా ఆరోజు ధరకు సరిపడా మైక్రో గ్రాములో బంగారం మీకు లభించే అవకాశం ఉంటుంది.
అంతేకాదు డిజిటల్ వాలెట్ రూపంలో బంగారు కొనుగోలు చేస్తే మీరు తిరిగి దాన్ని విక్రయించే వీలు ఉంటుంది ఒకవేళ పెద్ద మొత్తంలో కొన్నట్లయితే అంటే సుమారు అర గ్రామం నుంచి ఒక గ్రామం వరకు కొనుగోలు చేసినట్లయితే మీరు ఫిజికల్ రూపంలో కూడా బంగారాన్ని డెలివరీ పొందే వీలుంది.
అంతేకాదు ప్రతినెలా కొద్ది మొత్తంలో మీరు డిజిటల్ వాలెట్లో బంగారం కొనుగోలు చేసి దాన్ని ఫిజికల్ రూపంలో డెలివరీ పొందే వీలుంటుంది. తద్వారా మీరు తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ లభిస్తుంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానం మీకు ఉపయోగపడుతుంది.
రాబోయే అక్షయ తృతీయ సందర్భంగా మీరు కూడా బంగారం కొనుగోలు చేయాలనుకుంటే, ఇలాంటి పద్ధతిలో కూడా బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా మీరు కొద్ది మొత్తంలో డబ్బు ఉన్నప్పటికీ, బంగారం కొనుగోలు చేసే వీలు చిక్కుతుంది.