బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. దీపావళికి ఎంత పెరగనుందంటే..
పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. ఒకరోజు తగ్గితే మరొకరోజు పెరుగుతోంది. తాజాగా నేడు పసిడి ధరలు దేశంలో మళ్ళీ పెరిగాయి. అయితే ఇండియాలో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్, పండగ సీజన్ లో ప్రత్యేకంగా కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి.

మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం 9.31 గంటలకు 10 గ్రాముల గోల్డ్ కాంట్రాక్టులు 0.29 శాతం పెరిగి రూ. 47,541 కి చేరాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.39 శాతం పెరిగి కిలోకు రూ. 65,269 కి చేరాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన డాలర్‌తో పోలిస్తే బంగారం ధరలు పెరిగాయి. ఒక నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్‌కు 1,785.00 డాలర్లు, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,786.00 డాలర్లకు చేరుకుంది. గత 15 రోజుల్లో 24 క్యారెట్ల పసిడి ధర సుమారు వెయ్యి పెరగగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.700 వరకు పెరిగింది.
భారతదేశంలో బంగారం ధర
చెన్నైలో బంగారం రేటు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 44,840.
ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 46,470.
ఢిల్లీలో బంగారం రేటు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 46,700.
కోల్‌కతాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 46,900.
బెంగళూరులో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 44,550.
హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 44,550
హైదరాబాద్‌లో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,600
సాధారణంగా 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది కానీ ఈ బంగారం నుండి నగలను తయారు చేయలేము, కాబట్టి ఆభరణాల తయారీలో ఎక్కువగా 22 క్యారెట్ల బంగారం ఉపయోగించబడుతుంది.
క్యారెట్ బంగారం ఎంత స్వచ్ఛమైనది
24 క్యారెట్ల బంగారం - 99.9 శాతం.
23 క్యారెట్ల బంగారం - 95.8 శాతం.
22 క్యారెట్ల బంగారం - 91.6 శాతం.
21 క్యారెట్ల బంగారం - 87.5 శాతం.
18 క్యారెట్ల బంగారం - 75 శాతం.
17 క్యారెట్ల బంగారం - 70.8 శాతం.
14 క్యారెట్ల బంగారం - 58.5 శాతం.
9 క్యారెట్ల బంగారం - 37.5%.