Today Gold Rate: మళ్లీ బంగారం ధరలో పెరుగుదల, నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి
Today Gold Rate: బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మొన్నటి వరకు స్వల్పంగా ధరలు తగ్గాయి .. మళ్లీ ఇప్పుడు ధర పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా మూడో రోజూ పెరిగింది. అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడమే ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.

నేటి బంగారం ధరలు
బంగారం ధరలు మళ్లీ వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఇప్పటివరకు పెరిగిన ధరలు చూసే అందరూ భయపడుతుంటే ఇంకా పెరగడం కలవరపాటుకు గురిచేస్తున్నాయి. బంగారంతో పాటూ వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. నవంబర్ 26, 2025న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ ఇచ్చాము.
విశాఖలో ధరలు
ఈ రోజు విశాఖపట్నం నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 12,791 రూపాయలకు చేరింది. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 11,725 రూపాయలకు, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర 9,593 రూపాయలకు చేరింది. నిన్నటితో పోలిస్తే ఈ ధరలు 80 రూపాయలు గ్రాముపై పెరిగింది. ఇక వెండి ధరలో కూడా పెరుగుదల ఉంది. వెండి కిలోకు వంద రూపాయలు పెరిగి 1,67,100 కు చేరింది.
హైదరాబాద్ లో బంగారం ధరలు
ఈ రోజు హైదరాబాద్ నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 12,791 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 11,725 రూపాయలుగా ఉంది. 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర 9,593 రూపాయలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే ఒక గ్రాము వెండి ధర 172 రూపాయలుగా ఉంది. ఇక పది గ్రాముల వెండి 1,720 రూపాయలుగా ఉంది. కిలో వెండి 1,72,000 రూపాయలుగా ఉంది.

