Gold Rate: వామ్మో మళ్లీ బంగారం ధర పెరిగిపోయింది.. ఇలాగైతే ఎప్పుడు కొనాలి?
Gold Rate: బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితి మళ్లీ మారిపోయింది. మొన్నటివరకు తగ్గినట్టు కనిపించిన బంగారు ధరలు... ఇప్పుడు మళ్లీ గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు బంగారం ధర ఎలా ఉందో తెలుసుకోండి.

పెరుగుతున్న బంగారం ధరలు
మనదేశంలో బంగారం ధరలు మళ్లీ పెరగడం మొదలైపోయింది. నవంబర్ 25, సోమవారం నాడు బంగారం ధరలను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం రేట్లు ఒక్కరోజులోనే ధర విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిస్థితులు, డాలర్ విలువ తగ్గడం, వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండడం, విదేశీ పెట్టుబడిదారుల బంగారం కొనుగోళ్లు పెరగడం వంటి కారణాల వల్ల దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల కొంతకాలంగా బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి మాత్రం భారం అవుతోంది. బంగారం ధరలు రోజురోజుకు పెరగడం వల్ల సాధారణ ప్రజలు ఆభరణాలు కొనడం కష్టంగా మారుతోంది.
ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి?
24 క్యారెట్ బంగారం ధరలో ఈరోజు ఒక్క గ్రాముకు సుమారు 191 రూపాయల పెరుగుదల కనిపించింది. దీంతో ఒక బంగారం గ్రాము ధర 12,704 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈ పెరుగుదలతో 1,27,040 రూపాయలు అయ్యింది. ఈ భారీ పెరుగుదల ఒకేరోజులో నమోదు కావడం మధ్యతరగతి ప్రజలు కంగారు పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రేడర్లు భారీగా కొనుగోళ్లు చేయడంతో ధరలు మరింత ఎగబాకాయి.
22 క్యారెట్ బంగారం ధర
22 క్యారెట్ బంగారం ధర కూడా పెరిగింది. ఒక్క గ్రాము ధర 175 రూపాయలు పెరిగి 11,645 రూపాయలకు చేరింది. పది గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర 1,16,450 రూపాయలు, 100 గ్రాములకు 11,64,500 రూపాయలు అయ్యింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతున్న సీజన్‌లో బంగారం ధర ఇలా పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆభరణాలు కొనాలని అనుకున్నవారు ఇప్పుడు కొనాలా లేక మరికొన్ని రోజులు వేచి చూడాలా? అనే సందేహంలో పడుతున్నారు.
18 క్యారెట్ బంగారం ధర
18 క్యారెట్ బంగారం ధర కూడా పెరుగుతూనే ఉంది. ఒక్క గ్రాము ధర 143 రూపాయలు పెరిగి 9,528 రూపాయలు చేరింది. సాధారణంగా 18 క్యారెట్ బంగారం ఆభరణాలు మిశ్రమ రూపంలో ఉండటం వల్ల ధర తక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు వచ్చిన పెరుగుదలతో దీని ధర కూడా పెరిగింది. 10 గ్రాముల ధర 95,280 రూపాయలు, 100 గ్రాముల ధర 9,52,800 రూపాయలు అయ్యింది. దీంతో 18 క్యారెట్ బంగారం కొనేవారికి కూడా అదనపు ఖర్చు తప్పడం లేదు.
ధర ఇక పెరుగుతూనే ఉంటుంది
బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతున్న దిశలోనే ఉన్నాయి. ఇది ఎప్పటి వరకు ఇలాగే కొనసాగుతుందో చెప్పలేము. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు మార్పులపై రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ తగ్గే అవకాశం కూడా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం డాలర్ విలువ మరింత తగ్గితే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు తగ్గితే కూడా పెట్టుబడిదారులు బంగారంపైనే ఎక్కువ నమ్మకం పెడతారు. బంగారం కొనాలా, పెట్టుబడి పెట్టాలా అనే నిర్ణయం తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిదని వారు సూచిస్తున్నారు.

