MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Prices: రికార్డు బద్దలు కొట్టిన బంగారం ధరలు.. రూ.90 వేలు దాటిన గోల్డ్, త్వరలోనే రూ.లక్ష గ్యారెంటీ

Gold Prices: రికార్డు బద్దలు కొట్టిన బంగారం ధరలు.. రూ.90 వేలు దాటిన గోల్డ్, త్వరలోనే రూ.లక్ష గ్యారెంటీ

Gold Prices: బంగారం ధరలు గత రికార్డులను బద్దలు కొట్టేశాయి. దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో గోల్డ్ రేట్ రూ.90 వేల మార్కును దాటేసింది. ఇది త్వరలో లక్ష కూడా దాటుతుందని అంచనా. బంగారం ధరలు ఇంత వేగంగా పెరగడానికి కారణాలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Mar 16 2025, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మీరు చాలా రోజుల నుంచి బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయిలే ప్రస్తుతం రేటు ఎక్కువగా ఉంది కదా.. కాస్త రేటు తగ్గాక బంగారం కొందామని ఆగిపోయారా? వెంటనే గాని మీరు బంగారం కొనకపోతే ఇప్పట్లో కొనలేరు. ఎందుకంటే త్వరలోనే బంగారం ధర రూ.లక్ష దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు గోల్డ్ కొనాలనుకుంటే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కొనడం మంచిది. 
 

25

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో జౌన్స్ బంగారం 3000 డాలర్లు పలుకుతోంది. ఇది ఇలాగే కొనసాగుతూ పెరుగుతూ పోతుందని, త్వరలో బంగారం రూ.లక్ష దాటుతుందని  మార్కెట్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంలో బంగారం ధరలు కొంచెంకొంచెంగా పెరుగుతున్నాయి. కాని గత వారం రోజులుగా జెట్ స్పీడ్ గా పెరగడం జరిగింది. అందుకే గత రికార్డులు సైతం బద్దలు కొడుతూ రూ.90 వేల మార్కును దాటేసింది. 
 

ఇది కూడా చదవండి రిస్క్ లేకుండా ఎక్కువ లాభాలు కావాలంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయండి. ఇవిగో టిప్స్

35

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మార్చి 13న 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.90 వేల మార్కును దాటింది. అదేవిధంగా వెండి కూడా కిలో రూ.1.03 లక్షలకు చేరింది. మార్చి 14న 10 గ్రాముల బంగారం ధర రూ.90,450గా నమోదైంది. అలాగే కిలో వెండి రూ.1.14 లక్షలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్ లో మార్చి 14న బంగారం తొలిసారిగా ఒక జౌన్స్ ధర రూ.3000 డాలర్లు పలికింది. దీన్ని బట్టి బంగారం ధరలు ఎలా రికార్డులు నెలకొల్పుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 
 

45

బంగారం ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధరలు ఇలా రికార్డులు బద్దలుకొట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం, ఇంకా అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కొన్ని దేశాలు బంగారం రూపంలో ఆర్థిక నిల్వలను ఉంచుకోవాలని చూస్తుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడం కూడా బంగారం ధరలపైన ప్రభావం చూపుతోంది. వీటికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, ప్రకటనలు బంగారం ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 

55

బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది
ప్రస్తుతం బంగారం పరుగులు చూస్తుంటే ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. కాని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మారితే కచ్చితంగా అవి గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపుతాయి. అవేంటంటే... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో అందరూ బంగారం పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే గోల్డ్ ఈటీఎఫ్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వస్తే పెట్టుబడిదారులు స్టాక్స్ పై పెట్టుబడి పెట్టొచ్చు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా డాలర్ విలువ పటిష్టంగా మారినా బంగారంపై పెట్టుబడులు తగ్గి ధరలు తగ్గుతాయి. ఇవన్నీ జరగాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అది కూడా ప్రపంచ పరిస్థితులు మారకుండా ఉంటేనే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. లేదంటే త్వరలోనే రూ.లక్ష దాటుతుందనడంలో సందేహం లేదు. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved