MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Jan dhan yojana: ప్రజలారా జాగ్రత్త.. జన్ ధన్ ఖాతాల్లోంచి డబ్బులు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు

Jan dhan yojana: ప్రజలారా జాగ్రత్త.. జన్ ధన్ ఖాతాల్లోంచి డబ్బులు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు

Jan dhan yojana: ప్రతి భారతీయుడికి బ్యాంకు ఖాతా కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పథకం జన్ ధన్ యోజన. కానీ సైబర్ నేరస్తులు దీనిని కూడా వదలలేదు. ఎన్నో రాష్ట్రాలలో జన్ ధన్ ఖాతాల నుంచి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 24 2025, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం
Image Credit : Pixabay

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం

మనదేశంలో సుమారు 42 శాతం ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేవి కాదు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి వారికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి కనీసం ఒక బ్యాంకు ఖాతా అయినా ఉండాల్సిందేనని ఈ పథకం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో పాటు ప్రతి ఖాతాదారులకు కొన్ని సౌకర్యాలను కూడా అందించారు. రూ. 30,000 జీవిత భీమాను, లక్ష రూపాయల ప్రమాద భీమాను ఇచ్చారు. అలాగే ఖాతాదారుకు 5000 రూపాయల ఓవర్ డ్రాఫ్టును అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు మిత్ర ద్వారా ఈ బ్యాంకు సేవలను అందించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు దీనిని కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. జార్ఖండ్, అసోం, తమిళనాడు,మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాల్లోని పేద ప్రజలను మోసం చేసి ఖాతాలోని సొమ్మును దోచేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉద్యోగులుగా చెప్పుకుని
Image Credit : PTI

ఉద్యోగులుగా చెప్పుకుని

ఎంతోమంది పేదవాళ్లు, రైతులు సైబర్ మోసాలకు గురయ్యారు. తెలియని నెంబర్ నుండి ఫోన్లు చేసి తాము ప్రభుత్వ ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. కొన్ని సూచనలు ఇచ్చి ఫోన్ లో ఆ పనులు చేయమంటారు. ఆ తర్వాత బ్యాంకు ఖాతా నుండి డబ్బులు మాయమైపోతాయి. సైబర్ మోసాలు ఇలాగే కాదు ఎన్నో రకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో చోట్ల సైబర్ మోసాలకు గురైనట్టు రైతన్నలు, పేదవారు పోలీసులకు కంప్లైంట్లు ఇస్తున్నారు.

Related Articles

Related image1
Gig workers: గిగ్ వర్కర్స్ కోసం కొత్త చట్టం, అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరు?
Related image2
Gold from Dubai: దుబాయ్ నుండి ఎంత బంగారం ఫ్లైట్‌లో ఇండియాకు తెచ్చుకోవచ్చు?
34
వ్యవసాయ శాఖ ఉద్యోగులమని చెప్పి
Image Credit : Pixabay

వ్యవసాయ శాఖ ఉద్యోగులమని చెప్పి

కొంతమంది వ్యవసాయ శాఖ ఉద్యోగులుగా నటిస్తూ రైతన్నలకు ఫోన్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రయోజనాలు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఇస్తామని హామీ ఇచ్చి వారి దృష్టిని ఆకర్షిస్తున్నారు వారి ఫోన్లకు లింకులు పంపి ఆ లింకును క్లిక్ చేయాలని చెబుతున్నారు. దీంతో ఏమీ తెలియని రైతులు, పేదవారు ఆ లింక్ పై క్లిక్ చేసి సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి.

 కొన్నిసార్లు ప్రధానమంత్రి ఫోటో ఉన్న ప్రకటనలను తయారు చేసి ఫోన్లకు పంపిస్తా.రు వాటిపై ఐదు వేలు రూపాయలు పొందేందుకు అర్హులుగా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేస్తారు. దానిపై క్లిక్ చేయగానే వినియోగదారులు వేరే వెబ్‌సైట్ కు నావిగేట్ అవుతారు. అక్కడ స్క్రాచ్ చేయమంటూ ఒక కార్డు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన ఏదైనా యూపీఐ యాప్ లకు నావిగేట్ అవుతారు. అప్పుడు 5000 రూపాయలు క్లెయిమ్ చేయడానికి యూపీఐ పిన్ ను నమోదు చేయమని అక్కడ మెసేజ్ వస్తుంది. పిన్ నమోదు చేయగానే ఎకౌంట్లో ఉన్న డబ్బులు అన్ని మోసగాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతాయి. ఇలా ఇప్పటికి ఎంతోమంది మోసపోయారు. రోజురోజుకి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

44
సైబర్ నేరగాళ్లతో పెరుగుతున్న సమస్య
Image Credit : Pixabay

సైబర్ నేరగాళ్లతో పెరుగుతున్న సమస్య

సైబర్ నేరస్థులు సామాజిక లక్ష్యాలను పట్టించుకోరు. డబ్బును నిమిషాల్లో తమ అకౌంట్లోకి తరలించడమే వారి లక్ష్యం. చాలా ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలు వాడకుండా నిద్రాణంలో ఉన్నాయి. వాటిని సైబర్ నేరస్థులు యాక్టివేట్ చేస్తున్నారు. ఆ ఖాతాదారుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను మార్చడం ద్వారా కేవైసీ ని పూర్తి చేసి కొత్త ఏటీఎం కార్డులను తీసుకుంటున్నారు. మరణించిన కస్టమర్ ఖాతాలను కూడా యాక్సెస్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను సైబర్ నేరగాళ్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image2
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image3
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Related Stories
Recommended image1
Gig workers: గిగ్ వర్కర్స్ కోసం కొత్త చట్టం, అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరు?
Recommended image2
Gold from Dubai: దుబాయ్ నుండి ఎంత బంగారం ఫ్లైట్‌లో ఇండియాకు తెచ్చుకోవచ్చు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved