MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate: ఇప్పుడు బంగారం కొనడం సేఫేనా? నిపుణులు ఏం చెప్తున్నారంటే..

Today Gold Rate: ఇప్పుడు బంగారం కొనడం సేఫేనా? నిపుణులు ఏం చెప్తున్నారంటే..

Today Gold Rate: గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ కాస్త స్థిరంగా ఉంది. కానీ వెండి మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. మరి ఇప్పుడు బంగారం కొనడం సేఫేనా?

2 Min read
Author : Nandini Arava
Published : Apr 25 2026, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెరిగిన వెండి ధరలు
Image Credit : Getty

పెరిగిన వెండి ధరలు

ప్రస్తుతం భారత్‌లో బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 2026 చివరి వారానికి వస్తే, 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు సుమారు రూ. 1.53లక్షల మధ్య కొనసాగుతోంది. 22 క్యారెట్ బంగారం ధర గ్రాముకు సుమారు రూ.1.40లక్షల మధ్యలో ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ధరలపై గ్లోబల్ మార్కెట్‌ ప్రభావం
Image Credit : Getty

ధరలపై గ్లోబల్ మార్కెట్‌ ప్రభావం

ఇటీవల కొన్ని రోజులుగా బంగారం ధరల్లో కొద్దిపాటి తగ్గుదల కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు ధరల మార్పునకు కారణమవుతున్నాయి. అలాగే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం కూడా ధరలను ప్రభావితం చేస్తోంది.

Related Articles

Related image1
Today Gold Price: పసిడి కొనడానికి ఇదే మంచి సమయం..అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు ఢమాల్
Related image2
Today Gold Rate: రష్యా తీసుకున్న నిర్ణయంతో పతనం దిశగా బంగారం, వెండి
35
బంగారంపై రూ.3000 తగ్గుదల
Image Credit : Getty

బంగారంపై రూ.3000 తగ్గుదల

గత నాలుగు రోజుల్లోనే తులం బంగారం ధర సుమారు రూ.3000 మేర తగ్గింది. ప్రస్తుతం బంగారం స్థిరంగానే ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,950కు చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,40,200 వద్ద నమోదైంది. వెండిపై కిలోకు రూ.5000 పెరిగింది. కిలో వెండి ప్రస్తుతం రూ.2.70 లక్షలు ఉంది.

45
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం కొనడం సేఫేనా?
Image Credit : Gold Price\Twitter

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం కొనడం సేఫేనా?

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం కొనడం సేఫేనా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. సాధారణంగా బంగారం ఒక సేఫ్ హేవెన్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తారు. అంటే మార్కెట్‌లో అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం విలువ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2026లో కూడా బంగారం ధరలు తాత్కాలికంగా ఎగబాకడం, పడిపోవడం సహజమే అయినా, దీర్ఘకాలికంగా మంచి రాబడులు ఇవ్వగలదనే అభిప్రాయం నిపుణులది. కాబట్టి దీన్ని ఒక స్థిర పెట్టుబడి సాధనంగా చూడవచ్చు.

55
స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్‌మెంట్ బెటర్ ఆప్షన్
Image Credit : Getty

స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్‌మెంట్ బెటర్ ఆప్షన్

అయితే బంగారం కొనడానికి సరైన సమయం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ధరలు తగ్గినప్పుడు కొనడం మంచిదని భావిస్తారు. ఒక్కసారిగా భారీగా కొనడం కంటే, కొంతకొంతగా దశలవారీగా కొనడం మంచిది. దీనిని ‘స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్‌మెంట్’ లేదా SIP తరహా విధానం అంటారు. పండుగల సమయంలో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, వాటికి ముందుగానే కొనుగోలు చేయడం కూడా లాభం ఉంటుంది.

ప్రస్తుతం బంగారం ధరలు కొద్దిగా తగ్గినా భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ అంచనాలు సూచిస్తున్నాయి. కాబట్టి తొందరపడి కాకుండా ప్రణాళికతో కొనుగోలు చేస్తే బంగారం మంచి పెట్టుబడిగా మారుతుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
90 శాతం మందికి ఇది తెలియ‌దు.. CNG కొట్టిచ్చేప్పుడు ప్ర‌యాణికుల‌ను ఎందుకు దిగ‌మంటారు.?
Recommended image2
Amazon Now: అమెజాన్ బంపర్ ఆఫర్.. సగం ధరకే సరుకులు, ఆఫర్ అవ్వకముందే ఇప్పుడే కొనేయండి
Recommended image3
Gold Rate: పసిడి ప్రియలకు గుడ్ న్యూస్...బంగారం, వెండి ధరలు భారీగా పతనం
Related Stories
Recommended image1
Today Gold Price: పసిడి కొనడానికి ఇదే మంచి సమయం..అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు ఢమాల్
Recommended image2
Today Gold Rate: రష్యా తీసుకున్న నిర్ణయంతో పతనం దిశగా బంగారం, వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved