- Home
- Business
- Gold Price: ఒక్క రోజులోనే రూ. 3 వేలు జంప్.. తాజా బంగారం ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
Gold Price: ఒక్క రోజులోనే రూ. 3 వేలు జంప్.. తాజా బంగారం ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
Gold Price: బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం గోల్డ్ రేట్ ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరింది. వివరాల్లోకి వెళితే..

ఒక్క రోజులోనే రూ. 3 వేలకిపైగా..
అక్టోబర్ 14వ తేదీన బంగారం ధర ఆల్‌టైమ్ హైకి చేరింది. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,400గా ఉండగా, మంగళవారం ఏకంగా రూ. 1,28,680కి చేరింది. దీంతో ఒక్కరోజులోనే ఏకంగా రూ. 3వేలకి పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే తులం ధర రూ. 1,17,950 వద్ద కొనసాగుతోంది.
ఏ నగరంలో ఎంత ఉందంటే.?
* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,830 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 128680గా ఉంది.
* బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 128680 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో బంగారం ధర అన్నింటికంటే అత్యధికంగా ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 129000 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్ విషయానికొస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 128680 వద్ద కొనసాగుతోంది.
రూ. లక్షలు దాటిన వెండి ధర
వెండి కూడా బంగారంతో పోటీపడి దూసుకుపోతోంది. కిలో వెండి ధర ఏకంగా రూ. 2 లక్షలు దాటేసింది. చెన్నై, హైదరాబాద్‌లో అత్యధికంగా కిలో వెండి ధర ఏకంగా రూ. 2,06,000 వద్ద కొనసాగుతోంది. అలాగే ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,89,000గా ఉండగా.. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 1,93,00 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.?
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను బంగారం వైపు ఆకర్షిస్తున్నాయి. డాలర్ విలువ పడిపోవడం కూడా ఈ పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. డాలర్ బలహీనతతో బంగారం సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తోంది. ట్రెజరీ బాండ్ల లాభాలు తగ్గడంతో ఇన్వెస్టర్ల దృష్టి బంగారం వైపే మళ్లింది. ఫలితంగా బంగారం ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరాయి.
10 రోజుల్లో రూ. 35 వేలు పెరిగిన వెండి
వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజే రూ. 5వేలు పెరగగా, మంగళవారం దాదాపు రూ. 4 వేలు పెరిగింది. కాగా గడిచిన 10 రోజుల్లో కిలో వెండి సుమారు రూ.35,000 పెరగడం విశేషం. ఈ రేటు పెరుగుదలతో వెండి ధర పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.రానున్న రోజుల్లోనూ వెండి ధరలు మరింత పెరగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.