MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Gold : తులం బంగారం 2 లక్షలు అవుతుంది.. ఎందుకో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే

Gold : తులం బంగారం 2 లక్షలు అవుతుంది.. ఎందుకో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే

Gold Price Surge Explained: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ లెక్కలు చూస్తుంటే పసిడి పరుగులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. లక్షకు పైగా చేరిన బంగారం ధరలు త్వరలోనే తులం రూ.2 లక్షలు అవుతుందని అంచనాలున్నాయి. కారణాలు ఏంటో తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 03 2025, 09:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గోల్డ్ మార్కెట్ పై అంతర్జాతీయ ప్రభావం
Image Credit : stockphoto

గోల్డ్ మార్కెట్ పై అంతర్జాతీయ ప్రభావం

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఏడాది కాలంలోనే గోల్డ్ ధరలు డబుల్ అయ్యాయి. ఇంతటితో ఆగకుండా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నెలల్లోనే తులం బంగారం ధరలు రెండు లక్షల రూపాయలు అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు గమనిస్తే 24 క్యారెట్లు తులం సుమారు రూ.1.20 లక్షలుగా ఉంది. బంగారం ధరలు ఇంతలా పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

ప్రపంచ గోల్డ్ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్న పరిస్థితులు భారత్‌లోని బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతాయి. అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో డాలర్ విలువ, ఆర్థిక పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ విధానాల ప్రభావం, బంగారం ధరలను పెరిగేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరగడం వలన భారత మార్కెట్‌లో కూడా ధరలు పెరుగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బంగారం ధరల పై డీ-డాలరైజేషన్, సెంట్రల్ బ్యాంకుల ప్రభావం
Image Credit : Google

బంగారం ధరల పై డీ-డాలరైజేషన్, సెంట్రల్ బ్యాంకుల ప్రభావం

డీ-డాలరైజేషన్ కారణంగా, చైనా, రష్యా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ ఆధారిత ఆస్తులపై ఆధారపడకుండా, ఫారిన్ రిజర్వ్‌లో బంగారం నిల్వను పెంచుతున్నారు. దీని కారణంగా బంగారం ధరలు గ్లోబల్ స్థాయిలో పెరుగుతాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోలు ప్రత్యేకంగా భవిష్యత్ ఆర్థిక అస్థిరత నుండి రక్షణగా భావించడమే దీనికి కారణాలుగా ఉన్నాయి.

Related Articles

Related image1
IND vs WI : ముగ్గురు మొనగాళ్లు.. విండీస్ ను కుమ్మేశారు ! ఇదేం కొట్టుడు సామీ !
Related image2
Smart TV: రూ. 18 వేల‌కే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఇలాంటి ఛాన్స్ మ‌ళ్లీ రాదు గురూ..
36
గోల్డ్ పై జియోపాలిటికల్ టెన్షన్‌ల ప్రభావం
Image Credit : our own

గోల్డ్ పై జియోపాలిటికల్ టెన్షన్‌ల ప్రభావం

యుద్ధాలు, సరిహద్దు ఘర్షణలు, దేశాల వ్యూహాత్మక విరోధాలు, మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్-రష్యా ఘర్షణలు, చైనా-తైవాన్ అనిశ్చితి వంటి పరిస్థితులు పెట్టుబడిదారులను సేఫ్-హేవెన్ ఆస్తుల వైపు మళ్లిస్తాయి. ఫలితంగా బంగారం పై డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు కూడా మరింతగా పెరుగుతున్నాయి.

46
గోల్డ్ పై లిమిటెడ్ సప్లై ప్రభావం
Image Credit : AI Generated Photo

గోల్డ్ పై లిమిటెడ్ సప్లై ప్రభావం

బంగారం పరిమితంగా లభ్యమవుతుంది. కొత్త మైనింగ్ తవ్వకాలు పెరగలేదు. బంగారం అరుదైన ఆస్తి కావడంతో, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఆటోమాటిక్‌గా పెరుగుతాయి. మైనింగ్ సాంకేతిక పరిమితులు, సస్టైనబుల్ ఉత్పత్తి విధానాలు కూడా గోల్డ్ సరఫరాను పరిమితం చేస్తాయి. ఇది ధరల పెరుగుదలకు కారణంగా ఉంటుంది.

56
కరెన్సీ డెవాలివేషన్, ద్రవ్యోల్బణ ప్రభావం
Image Credit : AI Generated Photo

కరెన్సీ డెవాలివేషన్, ద్రవ్యోల్బణ ప్రభావం

దేశీయ కరెన్సీ విలువ డాలర్ లేదా ప్రధాన కరెన్సీలతో పోలిస్తే పడిపోతే, బంగారం లోకల్ కరెన్సీలో ఎక్కువ ఖరీదు అవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగడం వల్ల బంగారం ఇన్‌ఫ్లేషన్ హెడ్జ్ గా భావిస్తారు. పెట్టుబడిదారులు లోకల్, అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు చేస్తారు, తద్వారా ధరలు పెరుగుతాయి.

66
గోల్డ్ పై యూఎస్ డెఫిసిట్, అంతర్జాతీయ ఆర్థిక ప్రభావం
Image Credit : Getty

గోల్డ్ పై యూఎస్ డెఫిసిట్, అంతర్జాతీయ ఆర్థిక ప్రభావం

అమెరికా డెఫిసిట్, నేషనల్ డెబ్ట్ అధికంగా ఉన్నప్పుడు, డాలర్ బలహీన పడుతుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు సేఫ్-హేవెన్ ఆస్తులలో డబ్బు పెట్టడం పెరుగుతుంది. అమెరికా డెబ్ట్ సమస్యల కారణంగా బంగారం డిమాండ్ పెరుగుతూ, భారత మార్కెట్‌లో కూడా తులం ₹2,00,000 వరకు చేరే అంచనాలు బలపడుతున్నాయి.

అంతర్జాతీయ గ్లోబల్ మార్కెట్, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు, డీ-డాలరైజేషన్, జియోపాలిటికల్ టెన్షన్‌లు, లిమిటెడ్ సప్లై, కరెన్సీ డివాలివేషన్.. ఇలాంటి అనేక అంశాలు కలిసి తులం బంగారం ధరను ₹2,00,000కు చేరేలా మారుస్తాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, నిజంగానే బంగారం ధరలు రెండు లక్షలు అవుతుందా? లేదా అంతకు మించి పెరుగుతుందా లేదా తగ్గుతుందా? అనేది రాబోయే రోజులే స్పష్టం చేస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
బంగారం
భారత దేశం
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
IND vs WI : ముగ్గురు మొనగాళ్లు.. విండీస్ ను కుమ్మేశారు ! ఇదేం కొట్టుడు సామీ !
Recommended image2
Smart TV: రూ. 18 వేల‌కే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఇలాంటి ఛాన్స్ మ‌ళ్లీ రాదు గురూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved