Gold Rate : బంగారం ధర అప్పట్లోగా మరింత తగ్గే ఛాన్స్... ఎప్పుడు కొంటే లాభమో తెలుసా?
బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్ధాయికి చేరుకుంది… దీంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే భవిష్యత్ లో బంగారం తగ్గడం ఖాయమట.. ఇందుకు గల కారణాలేమిటి? ఎప్పుడు కొంటే లాభం? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బంగారం ధర తగ్గడం ఖాయమా?
Gold Price : బంగారం ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత మధ్య బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. అయితే రాబోయే కొన్నిరోజులు బంగారం ధరలు మరింత పెరిగే అవకావాలున్నాయని HSBC బ్యాంక్ అంచనా వేస్తోంది. అయితే ఇది ఎక్కువకాలం సాగదని.. 2025 చివర్లో బంగారం మార్కెట్లో కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇప్పుడు బంగారు ధరలు పెరగడానికి కారణమేంటి? తర్వాత తగ్గడానికి కారణమేంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రస్తుతం బంగారం ధర అంతకంతకు పెరగడానికి ప్రధాన కారణం... ప్రపంచ వాణిజ్య అనిశ్చితి. ముఖ్యంగా జులై 9న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించబోయే సరికొత్త టారిఫ్‌లు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఇది బంగారం ధర పరుగు పెట్టడానికి ప్రధాన కారణం.
బంగారంకు డిమాండ్ పెరుగుతోంది
ఇక డాలర్ బలహీనపడటం కూడా బంగారం ధర పెరగడానికి మరో కారణం. 1973 తర్వాత మళ్లీ ఇప్పుడే అమెరికన్ డాలర్ అత్యంత బలహీన స్థితిలో ఉంది. దీంతో డాలర్ తో పోలిస్తే ఇతర కరెన్సీలు బలపడ్డాయి... తద్వారా కొనుగోలు శక్తి పెరిగి బంగారంకు డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగారం ధరలు పెరిగింది.
బంగారం ధరపై HSBC అంచనాలివే...
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన HSBC తాజా అంచనా ప్రకారం 2025లో ఔన్స్ బంగారం సగటు ధర 3,215 డాలర్లుగా ఉండొచ్చట. గత అంచనాతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయితే ఈ పెరుగుదలలో ఇప్పటికే ఎక్కువ భాగం పూర్తయిందని... తద్వారా భవిష్యత్తులో బంగారం పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉందని HSBC బ్యాంక్ తెలిపింది.
ధరల పెరుగుదల వల్ల బంగారం మైనింగ్ పెరుగుతుంది... దీనివల్ల సరఫరా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారు నాణేలు, ఆభరణాల కొనుగోలు తగ్గుతుంది. ఇలా డిమాండ్ తగ్గడమే భవిష్యత్ లో బంగారం ధరలు తగ్గడానికి కారణంగాఅవుతుందని HSBC పేర్కొంది.
బంగారం ధర తగ్గే ఛాన్స్
సాధారణంగా ‘సేఫ్ హేవెన్’గా భావించే బంగారం 2025లోనూ ఇదే స్థాయిలో కొనసాగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ధరల పెరుగుదలను మరింత ఆశించకూడదని హెచ్చరిస్తున్నారు. 2025 చివరినాటికి సరఫరా ఎక్కువ, డిమాండ్ తక్కువ ఉండటం వల్ల బంగారం ధరలో కొంత తగ్గుదల రావచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.