Gold price: భారీగా పతనమవుతోన్న బంగారం ధరలు.. తులం గోల్డ్ ఎంతకు చేరిందో తెలుసా.?
గత కొన్ని రోజులుగా చుక్కులు చూపించిన బంగారం ధర కాస్త శాంతిస్తోంది. తులం బంగారం రూ. లక్షలకు చేరడం ఖాయమని అంతా అనుకుంటున్న సమయంలో ధరలు తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం కూడా బంగారం ధరలు తగ్గడం విశేషం..

ఆకాశమే హద్దుగా దూసుకుపోయినా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి. వరుసగా రెండో రోజు బంగారం ధర భారీగా తగ్గడం గమనార్హం. శుక్రవారం తులం బంగారంపై రూ. 500 వరకు తగ్గడం విశేషం. ఇలా రెండు రోజుల్లోనే ఏకంగా సుమారు రూ. 900 వరకు బంగారం ధర దిగొచ్చింది. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,750కాగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 86,990కి దిగొచ్చింది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,600కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,840 వద్ద కొనసాగుతోంది.
* ఇక చెన్నైలోనూ బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,600గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,840గా ఉంది.
* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 79,600గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,840 వద్ద కొనసాగుతోంది.
* దేశంలో మరో ప్రధాన నగరమైన పుణెలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,600కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,840 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్‌లో కూడా బంగారం ధర భారీగా తగ్గింది. ఇక్కడ శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 79,600గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,840 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడ విషయానికొస్తే ఇక్కడ కూడా 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 79,600కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,840 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,840గా ఉంది.
Silver Price Today
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.?
వెండి ధరలు కూడా బంగారం దారిలోనే వెళ్తున్నాయి. శుక్రవారం కిలో వెండిపై ఏకంగా రూ. 1000 తగ్గడం విశేషం. దీంతో కిలో వెండి ధర రూ. 97,000కి చేరింది. ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, పుణె వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.97,000 వద్ద కొనసాగుతోంది. అయితే హైదరాబాద్, కేరళ, చెన్నైలో మాత్రం దేశంలోనే అత్యధికంగా కిలో వెండి ధర రూ. 1,05,000 వద్ద కొనసాగుతోంది.