Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర.. కొనడానికి ఇదే సరైన సమయం
గతకొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి బంగారం ధరలు. తులం ఏకంగా రూ. 90 వేలకు చేరువైంది. ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షకు చేరువకావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఉన్నట్లుండి బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారం దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

బంగారం ధరలు చుక్కులు చూపిస్తున్న తరుణంలో తాజాగా ఒక రిలీఫ్ లభించింది. మొన్నటి వరకు జెట్ స్పీడ్‌తో దూసుకుపోయిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. గురువారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఒకే రోజు ఏకంగా రూ. 400 తగ్గడం విశేషం. గడిచిన కొన్ని రోజుల్లో ఇంతలా బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,250కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,530 వద్ద కొనసాగుతోంది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,100కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,380 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.?
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,100గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గి రూ. 87,380 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,100 వద్ద కొనసాగుతుండగా. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.?
వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 98,000 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా హైదరాబాద్, కేరళ, చెన్నైలలో కిలో వెండి ధర రూ. 1,06,000గా ఉంది.