దిగోస్తున్న బంగారం ధరలు.. కొనేందుకు మంచి ఛాన్స్.. తాజాగా ధరలు తెలుసుకోండి..
ఎంసిఎక్స్ లో 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం పడిపోయింది. నేడు ఎంసిఎక్స్ లో బంగారం ధరలో 0.13 శాతం పతనం పది గ్రాముల బంగారం ధర రూ.48,008కి దిగోచ్చింది. దీంతో పాటు వెండి మెరుపులు కూడా నేడు కనుమరుగైంది. దీని ధర 0.13 శాతం తగ్గి కిలోకి రూ.60,738కి చేరింది.

కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం నేడు ఫెడ్ సమావేశం కారణంగా బంగారం ధరలో తగ్గుదల ఉంది. యుఎస్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసినందున ఈ ఫెడ్ సమావేశం నుండి బాండ్ టేపరింగ్ ప్రకటన వెలువడుతుందని రెలిపారు. అయితే, ద్రవ్యోల్బణం త్వరలో ముగియబోదని, వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం స్వల్పకాలంలో ఉండబోదని చెప్పారు.
రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్‌లో వైస్ ప్రెసిడెంట్-కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ సుగంధ సచ్‌దేవా మాట్లాడుతూ, "ఫెడ్ నేటి సమావేశంలో క్విక్ బాండ్ టేపరింగ్ చర్యలను ప్రకటించవచ్చని అలాగే ఏప్రిల్ లేదా మే నాటికి యుఎస్‌లో ధరల పెంపుపై మరిన్ని సూచనలు ఇవ్వవచ్చన్న ఊహాగానాలపై బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. 2022లో US ఆర్థిక వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఫెడ్ మొగ్గు చూపుతుంది, కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ద్రవ్యోల్బణం కఠిన చర్యలకు మార్కెట్ అడ్జస్ట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే బంగారం ధరలలో ఏదైనా తగ్గుదల వచ్చే పక్షం నుండి ఒక నెల వరకు బంగారం పెట్టుబడిదారులు మంచి కొనుగోలు అవకాశంగా తీసుకోవాలి." అని తెలిపారు.
గ్లోబల్ మార్కెట్లు 01:26 GMT నాటికి స్పాట్ బంగారం 0.1 శాతం పెరిగి ఔన్స్‌కు 1,772.12డాలర్లకి చేరుకుంది. స్పాట్ వెండి 0.1 శాతం పెరిగి ఔన్స్‌కు 21.95 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం 0.1 శాతం క్షీణించి 919.05 డాలర్లకి, పల్లాడియం 0.6 శాతం పెరిగి 1,631.19డాలర్లకి చేరుకుంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,410 అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల ధర రూ. 47,160కి చేరుకుంది. అదేవిధంగా కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410కి చేరుకోగా, చెన్నైలో చాలా డిమాండ్ ఉన్న పసిడి ధర రూ.45,390కి విక్రయిస్తున్నారు.
ఒక వెబ్‌సైట్ ప్రకారం ఈ ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం న్యూఢిల్లీలో రూ.51,720గా, ముంబైలలో రూ.48,160గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,110గా ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విక్రయ ధర రూ.49,510గా ఉంది.
హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,260గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,370గా ఉంది. కేరళలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,370, 22 గ్రాముల పసిడి 10 గ్రాముల ధర రూ.45,260.
ఈ విధంగా బంగారం స్వచ్ఛతను తెలుసుకోండి
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారం ధర మారుతుంటుంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా 22 క్యారెట్లను ఉపయోగిస్తారు. కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. ఆభరణాలపై క్యారెట్‌ను బట్టి హాల్ మార్క్‌ను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది.
మీ నగరంలో ధరలను ఇక్కడ తెలుసుకోండి
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి. మీరు మీ నగరంలో బంగారం ధరను మొబైల్‌లో కూడా చెక్ చేయవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ధరలను చెక్ చేయవచ్చు. ఈ విధంగా ఇంట్లో కూర్చొని కూడా బంగారం తాజా ధరలను తెలుసుకోవచ్చు.