- Home
- Business
- బంగారం పతనం మొదలైందా.? భారీగా తగ్గిన గోల్డ్ ధర, ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలుసా.?
బంగారం పతనం మొదలైందా.? భారీగా తగ్గిన గోల్డ్ ధర, ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలుసా.?
Gold Price: బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర ఏకంగా రూ. లక్ష 30 వేలు దాటేసింది. అయితే బుధవారం బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపించింది.

భారీగా తగ్గిన బంగారం ధర
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే బుధవారం గోల్డ్ ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 24 క్యారెట్లపై ఒకే రోజు ఏకంగా రూ. 3,380 తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ. 1,27,200 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే రూ. 3100 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,16,600 వద్ద కొనసాగుతోంది.
ఏ నగరంలో ఎంత ఉందంటే..?
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,27,350 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే రూ. 1,16,750గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,27,200గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,750 వద్ద కొనసాగుతోంది.
* చెన్నై విషయానికొస్తే ఇక్కడ బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,640గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,17000 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎలా ఉందంటే..?
* హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,27,200 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,600గా ఉంది.
* విజయవాడలో కూడా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,27,200 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,600గా ఉంది.
వెండి ధరలో కూడా మార్పు
బంగారం కూడా వెండి మార్గంలో వెళ్తోంది. బుధవారం వెండి ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 2000 తగ్గడం విశేషం. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,62,000 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కేరళ, ముంబైలో కిలో వెండి ధర రూ. 1,62,000 వద్ద కొనసాగుతుండగా.. చెన్నై, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మాత్రం కిలో వెండి ధర ఏకంగా రూ. 1,80,000గా ఉంది.
ధరలు ఎందుకు తగ్గుతున్నాయి.?
బంగారం, వెండి ధరలు తగ్గడానికి పలు గ్లోబల్ కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా.. అమెరికా–చైనా మధ్య జరుగుతున్న టారిఫ్ చర్చలు సానుకూల దిశలో సాగుతుండడం. ఈ పరిణామం, ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ బలపడటం వంటి అంశాలు పసిడి, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, గ్లోబల్‌గా పసిడి, వెండి ఈటీఎఫ్‌లలో భారీ పెట్టుబడులు రావడంతోమెటల్స్ ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. అయితే టెక్నికల్ స్థాయిలో మార్కెట్ ఓవర్‌బాట్ పరిస్థితికి చేరుకోవడంతో, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల విలువైన లోహాల ధరల్లో స్వల్ప సవరణలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.