MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • Today Gold Rate: అక్షయ తృతీయ ముందు షాక్..భగభగమంటున్న బంగారం

Today Gold Rate: అక్షయ తృతీయ ముందు షాక్..భగభగమంటున్న బంగారం

Today Gold Rate: పసిడి కొనాలనుకుంటున్నారా? ఒక్కరోజులోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అక్షయ తృతీయ ముందు ఇలా రేట్లు ఎగసిపడటంతో మార్కెట్లో ఆందోళన నెలకొంది. 

2 Min read
Author : Nandini Arava
Published : Apr 18 2026, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షాకిచ్చిన బంగారం ధరలు
Image Credit : Getty

షాకిచ్చిన బంగారం ధరలు

దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గత నెలలో తగ్గుముఖం పట్టిన ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ పెరిగిన డిమాండ్ ప్రభావం మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.1,55,780కు చేరిన తులం బంగారం
Image Credit : Getty

రూ.1,55,780కు చేరిన తులం బంగారం

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గణనీయంగా పెరిగింది. గ్రాముకు రూ.15,578గా నమోదు కాగా, ఒక్కరోజులోనే రూ.81 పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల ధర రూ.1,55,780కు చేరింది. ఇదే విధంగా 22 క్యారెట్ల బంగారం కూడా పెరిగి గ్రాముకు రూ.14,280గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,800కు చేరింది. 

35
వెండి కంగారు
Image Credit : Getty

వెండి కంగారు

బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో గ్రాము వెండి ధర రూ.280 కాగా, కిలో వెండి ధర రూ.2,80,000కు చేరింది. ఒక్కరోజులోనే కిలోకు రూ.5,000 పెరగడం మార్కెట్‌లో ఆందోళన కలిగిస్తోంది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే అని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, డాలర్ మారకం విలువల్లో మార్పులు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు అన్నీ కలిసి దేశీయ ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

45
అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి డిమాండ్
Image Credit : Asianet News

అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి డిమాండ్

అదనంగా అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు మరింత ఎగిసిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిపుణులు సూచించినట్లుగా, ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కంటే దశల వారీగా కొనడం మంచిదని చెబుతున్నారు. అలాగే రోజువారీ ధరలను పరిశీలించడం కూడా అవసరం.

జ్యువెలరీ కొనుగోలు సమయంలో తయారీ ఛార్జీలు, జీఎస్టీ, హాల్‌మార్క్ వంటి అంశాలను తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇవి మొత్తం ఖర్చుపై ప్రభావం చూపుతాయి. 

55
నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం
Image Credit : Getty

నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం

ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే అక్షయ తృతీయ వరకు ధరల్లో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ముందుగానే ప్రణాళిక చేసుకుని కొనుగోలు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌
Recommended image2
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Recommended image3
యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? అసలేం జరుగుతోంది.?
Related Stories
Recommended image1
Today Gold Rate: బిగ్ రిలీఫ్..బంగారం ధరలు ఢమాల్..ఇప్పుడే కొనేయండి
Recommended image2
Today Gold Rate: పెళ్లిళ్ల సీజన్‌లో భారంగా మారిన బంగారం..తులంపై రూ.3,110 పెరుగుదల
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved