MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Gold And Silver Price Today: ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. నిల‌క‌డ‌గా వెండి ధరలు..!

Gold And Silver Price Today: ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. నిల‌క‌డ‌గా వెండి ధరలు..!

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (సోమ‌వారం) నిన్నటితో పోలిస్తే నేడు అతి స్వల్పంగా తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. ఇక వెండి ధరలు కూడా నేడు స్థిరంగా ఉన్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 25 2022, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బంగారం ధ‌ర‌లు సోమ‌వారం స్వ‌ల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో పసిడి ధర తగ్గింది. సోమ‌వారం బంగారం ధ‌ర రూ.53,440కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990కు చేరింది. బంగారం ధ‌ర‌ల‌తో పాటు వెండి ధర కూడా నిల‌క‌డ‌గా ఉంది. దీంతో వెండి కేజీకి రూ.71,600కు చేరింది. వెండి ధర వారం రోజుల్లో రూ.4000 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.71,600గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు సోమ‌వారం స్వ‌ల్పంగా తగ్గాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక సోమ‌వారం (ఏప్రిల్ 25, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
 

35

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,440 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,940గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440గా ఉంది.
 

45

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,990 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,440గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,990 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,440గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

55

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా, ముంబైలో రూ.66,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, కోల్‌కతాలో రూ.66,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, కేరళలో రూ.71,600గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, విజయవాడలో రూ.71,600 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Loan for Womens : తెలుగింటి మహిళలూ... మీ బిజినెస్ కోసమే ఈ బ్యాంక్ లోన్ స్కీమ్, ఎంతిస్తారో తెలుసా?
Recommended image2
Gold Rate Today: బంగారం సీన్ రివర్స్..రెండ్రోజుల్లో రూ.6వేలు పతనం, కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్
Recommended image3
IPO: దేశంలోనే అతిపెద్ద IPOకి రంగం సిద్ధం.. రూ. 37,700 కోట్ల స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved