MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Cotton Farmers: రైతులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌, లేబర్‌తో పనిలేదు, లాభం డబుల్‌.. గోద్రేజ్‌ వారి కలుపు మందు

Cotton Farmers: రైతులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌, లేబర్‌తో పనిలేదు, లాభం డబుల్‌.. గోద్రేజ్‌ వారి కలుపు మందు

పత్తి రైతులకు అదిరిపోయే శుభవార్త వచ్చింది. పత్తి పంటలో కలుపుతో బాధపడుతున్న రైతులకు ఇది బంగారం లాంటి వార్తగా చెప్పొచ్చు. కలుపుని ఇకపై లేబర్‌తో పనిలేకుండా నివారించుకునే మార్గాన్ని చెప్పారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jul 08 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
పత్తి రైతులకు గుడ్‌ న్యూస్‌
Image Credit : Asianet News

పత్తి రైతులకు గుడ్‌ న్యూస్‌

పత్తి రైతులకు శుభవార్త వచ్చింది. కలుపుతో బాధపడే రైతులకు గోద్రెజ్‌ వారు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇకపై లేబర్‌తో బాధపడకుండా సింపుల్‌గా ఒక మందుతో కలుపు నివారణ మార్గాలు తీసుకొచ్చారు. అదే గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ వారి `హిట్‌ వీడ్‌ మ్యాక్స్`. సాధారణంగా పత్తి రైతులు కలుపుతో ఇబ్బంది పడుతుంటారు. వర్షాకాలంలో ఎక్కువగా కలుపు వస్తుంటుంది. అది పత్తి పంటని ఎదగనివ్వకుండా చేస్తుంది. కలుపునే పత్తి మొక్కలను డామినేట్‌ చేస్తుంటుంది. దీని కారణంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతుంటారు.

కలుపు తీయడానికి కూలీలతో పనిలేదు

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ అనిశ్చితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఎల్‌నినో సంబంధిత వాతావరణ మార్పుల వల్ల వర్షపాతంలో ఎక్కువ హెచ్చుతగ్గులు, సుదీర్ఘ పొడి కాలాలు పత్తి పంట మొలకెత్తి ఎదిగే దశలో తేమ అసమానంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు గడ్డి జాతి, వెడల్పాటి ఆకు కలుపు మొక్కల ఒత్తిడిని పెంచుతాయి. ఇవి తరచూ అడపాదడపా కురిసే వర్షాల తర్వాత వేగంగా మొలిచి, పత్తి మొక్కలకు అవసరమైన తేమ, పోషకాలు, సూర్యరశ్మి, స్థలం కోసం వాటితో తీవ్రంగా పోటీ పడతాయి. కలుపు తీయడానికి చాలా వరకు లేబర్‌(కూలీల) మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేబర్‌ కొరత చాలా ఉంది. పైగా లేబర్‌ వచ్చి కలుపు తీయడానికి చాలా టైమ్‌ పడుతుంది. ఈ లోపు కలుపు పెరుగుతుంది. అది పత్తి పంట ఎదగకుండా చేస్తుంది. అంతిమంగా పత్తి మొక్క బలంగా ఎదగదు. అది పంట దిగుబడిని కూడా తగ్గిస్తుంది.

గడ్డి జాతి, ఆకు జాతి కలుపు నివారణ

ఈ నేపథ్యంలో రైతులకు బెస్ట్ రిలీఫ్‌ని తీసుకొచ్చింది గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ సంస్థ. హిట్‌వీడ్‌ మ్యాక్స్ అనే కలుపు మందుని తీసుకొచ్చింది. ఇది పత్తి పంటలో గడ్డి జాతి, ఆకు జాతి కలుపు మొక్కలను నివారించనుంది. కలుపు రెండు మూడు ఆకుల దశలో ఈ మందుని పిచికారి చేయడం వల్ల వంద శాతం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని, లేబర్‌తో సంబంధం లేకుండా కలుపుని నివారించుకోవచ్చు. ఈ మందు ప్రభావం దాదాపు నెల రోజులు ఉంటుందట. ఒక్కో పంపుకి 70 ఎంఎల్‌ మందుని ఒక పంపుకు పోసి దీన్ని పిచికారి చేయాల్సి ఉంటుందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
కలుపుతో బాధపడుతున్న 88శాతం రైతులు
Image Credit : Asianet News

కలుపుతో బాధపడుతున్న 88శాతం రైతులు

ఈ విషయాలను గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ జోన్‌ మేనేజర్‌ నరసింహా రెడ్డి వివరించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు 60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుందని, వీరిలో చాలా మందికి కలుపు నివారణ చర్యలపై అవగాహన లేదని తెలిపారు. చాలా వరకు కూలీల మీద ఆధారపడి కలుపుని తీస్తుంటారని, సకాలంలో కలుపు తీయకపోవడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కలుపు పెరగడం వల్ల పత్తి పంట బలంగా రావడం లేదని, దీంతో దిగుబడి తగ్గుతుందని చెప్పారు. దాదాపు రూ.40-85శాతం రైతులు ఈ కలుపు కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అదే సమయంలో 88శాతం రైతులు కలుపుకి సంబంధించిన సమస్యతో స్ట్రగుల్‌ అవుతున్నారని వెల్లడించారు.

రెండు మూడు ఆకుల దశలో హిట్‌ వీడ్‌ మ్యాక్స్ మందు పిచికారి 

మొత్తం రైతుల్లో 49శాతం రైతులకు ఈ కలుపు మందులపై అవగాహన లేదని చెప్పారు. అందుకే రైతుల్లో అవగాహణ కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌లో హిట్‌వీడ్‌ మ్యాక్స్ కలుపు మందు పత్తి పంటలో కలుపుని ఎలా నివారిస్తుందో వివరించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, పత్తి గింజలు పెట్టిన తర్వాత 5 నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ కలుపు మొక్కలు మొలకెత్తుతాయని, ఆ కలుపు మొక్కలు 2, 3 ఆకుల దశలో ఉన్నప్పుడే హిట్‌ వీడ్‌ మ్యాక్స్ మందుని పిచికారి చేస్తే కలుపు మొక్కలు చనిపోతాయని, ఈ మందు ప్రభావం దాదాపు 25-30 రోజుల వరకు ఉంటుందన్నారు. సాధారణ ఇతర ఫెర్టిలైజర్‌ మందులను వాడినట్టుగానే దీనిని వాడొచ్చని చెప్పారు. ఈ మందు పత్తి పంటకి ఎలాంటి నష్టాన్ని తీసుకురాదు అని వెల్లడించారు.

రైతులకు బంపర్‌ ఆఫర్‌

ఈ సందర్భంగా జోనల్‌ సేల్స్ లీడ్‌ సౌత్‌ మధు సీఆర్‌ మాట్లాడుతూ, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ వారి హిట్‌వీర్‌ మ్యాక్స్ మందుకు సంబంధించిన ఆఫర్‌ ని ప్రకటించారు. రైతులు ఈ మందుని వాడి, సరైన ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశ్యంతో ఒక ఆఫర్‌ని తీసుకొచ్చారు. అదే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌. ఈ మందుని కొనుగొలు చేశాక, బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి రిజిస్టర్‌ చేసుకుంటే రైతులకు మిమిమమ్‌గా రూ.50 నుంచి పైకి ఎత్తైనా క్యాష్‌ బ్యాక్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఒక్క ఎకరాకు 450 మిల్లీ లీటర్ల మందుని వాడాలని, ఒక్క బాటిల్‌తో రెండున్నర ఎకరాలకు ఈ మందుని పిచికారి చేయోచ్చని చెప్పారు. రైతులు ఈ మందుని ఉపయోగించి కలుపుని నివారించుకోవాలని, లేబర్‌తో పనిలేకుండా ఈజీగా కలుపుని నివారించుకోవచ్చని చెప్పారు. దీని ద్వారా పత్తి దిగుబడి పెరుగుతుందని, రైతులకు ఇప్పుడున్న దానికంటే డబుల్‌గా లాభాలను పొందే అవకాశం ఉందని చెప్పారు. ఈ టెక్నాలజీ ఇతర ఏ కంపెనీలోనూ లేదని, కేవలం గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ వారికి మాత్రమే సొంతమని అన్నారు. దీనిపై రైతుల్లో మరింత విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో రీజనల్‌ మేనేజర్‌ శరత్‌ చంద్ర కూడా పాల్గొన్నారు.

Related Articles

Related image1
Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?
Related image2
Soundarya Mistakes: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది, తప్పు మీద తప్పు చేసింది.. సంచలన రహస్యాలు లీక్‌

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలంగాణ
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
EPFO: ఉద్యోగులకు కేంద్రం శుభవార్త... జూలై 15న కల్లా మీ ఖాతాలోకి డబ్బులు
Recommended image2
SBI Manager Salary: ఎస్‌బీఐ మేనేజర్ జీతం ఎంత? అన్ని కటింగ్స్ తరువాత చేతికొచ్చేది ఎంత?
Recommended image3
Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
Related Stories
Recommended image1
Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?
Recommended image2
Soundarya Mistakes: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది, తప్పు మీద తప్పు చేసింది.. సంచలన రహస్యాలు లీక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved